North East Express: బీహార్‌లో ఘోర రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన నార్త్‌ఈస్ట్ ఎక్స్‌ప్రెస్.. కొనసాగుతున్న సహాయక చర్యలు..

North East Express Accident: బీహార్‌లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. బీహార్‌లోని బక్సర్ సమీపంలో నార్త్‌ఈస్ట్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. దీంతో కొన్ని భోగిలు పట్టాలు తప్పాయి.

North East Express: బీహార్‌లో ఘోర రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన నార్త్‌ఈస్ట్ ఎక్స్‌ప్రెస్.. కొనసాగుతున్న సహాయక చర్యలు..
Northeast Express Train

Updated on: Oct 11, 2023 | 11:42 PM

North East Express Accident: బీహార్‌లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. బీహార్‌లోని బక్సర్ సమీపంలో నార్త్‌ఈస్ట్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. దీంతో కొన్ని భోగిలు పట్టాలు తప్పాయి. నార్త్‌ఈస్ట్ ఎక్స్‌ప్రెస్.. ఢిల్లీలోని ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్ నుంచి గౌహతిలోని కామాఖ్య జంక్షన్‌కు రైలు వెళ్తోంది. ఈ సమయంలో బుధవారం రాత్రి బీహార్ బక్సర్ రఘునాథ్‌పూర్‌ స్టేషన్‌ సమీపంలో రైలు పట్టాలు తప్పింది. దీంతో ఐదు భోగిలు చెల్లాచెదురుగా పట్టాలపై కింద పడ్డాయి..

ప్రజలు ఆర్తనాదాలు విన్న స్థానిక ప్రజలు వారిని కాపాడేందుకు సహాయక చర్యలు చేపట్టారు. అధికారులు సైతం హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని.. సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు. అయితే, మొత్తం 9 బోగిలు పట్టాలు తప్పినట్లు పేర్కొంటున్నారు.

వీటికి సంబంధించిన కొన్ని దృశ్యాలు ట్విట్టర్ లో పోస్ట్ చేస్తున్నారు.. ప్రణా నష్టానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అందరూ క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తూ చాలా మంది ట్విట్టర్ లో సోషల్ మీడియాలలో పోస్ట్ చేస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..