నోయిడా ట్విన్ టవర్స్ కూల్చివేత కూల్చివేత అనంతరం దట్టమైన పొగ, ధూళి కణాలు చుట్టు పక్కల ప్రాంతాలను కమ్మివేశాయి. దీనితో ట్విటర్‌తో సహా పలు సోషల్ మీడియాల్లో పలు మీమ్స్ హల్ చల్ చేస్తున్నాయి..
Twin tower Noida demolition reason: చట్టవిరుద్ధంగా నోయిడాలో నిర్మించిన ట్విన్ టవర్లను కేవలం 10 సెకన్ల వ్యవధిలో ఆదివారం (ఆగస్టు 28) కూల్చివేసిన సంగతి తెలిసిందే. గత కొంత కాలంగా ఈ జంట భవనాల కూల్చివేత ప్రక్రియ వాయిదా పడుతూ వచ్చింది. నిబంధనలకు వ్యతిరేకంగా నిర్మించినందున గత యేడాది ఈ రెండు టవర్లను కూల్చివేయాలని అత్యున్నత ధర్మాసనం తీర్పు వెలువరించింది. దాదాపు 3,700ల కిలీల పేలుడు పదార్ధాలను ఉపయోగించి ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల 30 నిముషాలకు నేలమట్టం చేశారు. దాదాపు రూ.1200ల కోట్లతో నిర్మించిన ఈ అతిపెద్ద భవనాలను సెకన్లలో కూల్చివేశారు. ప్రస్తుతం ఈ విషయంపై సర్వత్రా చర్చకొనసాగుతోంది. ట్వీన్ టవర్ల కూల్చివేత దృశ్యాన్ని వీక్షించేందుకు నెటిజన్లు అమితాశక్తి కనబరిచారు. ఈ రెండు భవనాల కూల్చివేత వీడియోను నెట్టింట ఆసక్తిగా చూస్తున్నారు. ఐతే కూల్చివేత అనంతరం దట్టమైన పొగ, ధూళి కణాలు చుట్టు పక్కల ప్రాంతాలను కమ్మివేశాయి. దీనితో ట్విటర్‌తో సహా పలు సోషల్ మీడియాల్లో పలు మీమ్స్ హల్ చల్ చేస్తున్నాయి. వీటి వైపు మీరూ ఓ లుక్కేసుకోండి..