Michael romer: ‘ఆ విషయంలో భారత్ విజయం అద్వితీయం’.. నోబెల్ గ్రహీత్ మైఖేల్ రోమర్
నోబెల్ గ్రహీత, అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్థికవేత్త పాల్ మైఖేల్ రోమర్ భారత్‌పై ప్రశంసలు కురిపించారు. డిజిటల్ విప్లవంలో భారత్ సాధించిన ఘనత అద్వితీయని ఆయన అన్నారు. భారత్ నుంచి చాలా దేశాలు నేర్చుకోవాలని మైఖేల్ అభిప్రాయపడ్డారు. సామాజిక సంస్కరణలకు ప్రాధాన్యతనిచ్చే భారతదేశ నమూనాను ఇతర దేశాలు నేర్చుకోవాలని మైఖేల్ పిలుపునిచ్చారు..
నోబెల్ గ్రహీత, ప్రముఖ ఆర్థికవేత్త పాల్ మైఖేల్ రోమర్ భారతదేశంపై ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా భారత్‌దేశంలో డిజిటల్ విప్లవం అద్వితీయమని ఆయన కొనియాడారు. ఓ మీడియా సంస్థ నిర్వహించనున్న వర్లడ్ సమ్మింట్‌లో పాల్గొనేందుకు భారత్‌కు వచ్చిన మైఖేల్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత డిజిటల్ విప్లవం ప్రపంచ శక్తులకు కొత్త బెంచ్‌మార్క్‌ను నెలకొల్పిందని ఆయన అన్నారు.
భారత్ అనుసరిస్తున్న డిజిటల్ విధానాన్ని దక్షిణాసియా దేశాలు అవలంభించడం ద్వారా భారీగా ప్రయోజనం పొందవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం డిజిటల్ వ్యాప్తిని విజయవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లిందని, దేశంలోని ప్రతీ మూలకు డిజిటల్ చెల్లింపులు చేరడం అద్భుతమని ప్రశసించారు. ఈ డిజిటల్ విప్లవం సమాజంలోని ప్రజలందరికీ ప్రయోజనాలను అందించడానికి ఉపయోగపడుతుందని మైఖేల్ అన్నారు.
ప్రపంచంలోని చాలా దేశాలకు ఇది భిన్నమైందని అన్న మైఖేల్.. భారత్‌లో ఈ విధానం ద్వారా ప్రతీ ఒక్కరికీ ప్రయోజం జరుగుతోందని అన్నారు. భారతదేశం నుంచి ప్రేరణ పొంది ఇతర దేశాల్లో కూడా ఈ విధానం అమల్లోకి రావాలని ఆయన అన్నారు. చాలా పరిమిత ఆన్‌లైన్ అక్షరాస్యత ఉన్నప్పటికీ డిజిటలైజ్ ఆర్థిక వ్యవస్థ సాకారం కావడం అద్భుతమైన విజయం అని మైఖేల్ అభిప్రాయపడ్డారు. టెక్నాలజీ జీవన నాణ్యతను మెరుగుపరుస్తుందని.. సింగపూర్, దక్షిణ కొరియా వంటి దేశాల్లో ఇది స్పష్టంగా కనిపిస్తుందని అన్నారు. అయితే ప్రజాస్వామ్యంలో దేశం సామర్ధ్యం, దాని ఆశయంతో పాటు సాధించాలనే దృక్పథం ముఖ్యమని మైఖేల్ చెప్పుకొచ్చారు.
ఇక మైఖేల్ రోమర్ విషయానికొస్తే.. ఇయన ఒక అమెరికన్ ఆర్థికవేత్త, విధాన వ్యవస్థాపకుడు. మైఖేల్ బోస్టన్ కాలేజీలో యూనివర్శిటీ ప్రొఫెసర్ ఆఫ్ ఎకనామిక్స్‌గా సేవలందిస్తున్నారు. రోమర్ తన పనికి గాను ఆర్థిక శాస్త్రాలలో 2018 నోబెల్ బహుమతి (విలియం నార్దాస్‌తో పంచుకున్నారు) అందుకున్నారు. భారతదేశంలో డిజిటల్ విప్లవాన్ని రోమర్ గతంలో కూడా ప్రశంసించారు. భారతదేశం చేసిన పని నిజంగా అద్వితీయమని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రపంచంలోని మిగిలిన దేశాలు దీనిని చూసి నేర్చుకోవాలని గతంలో కూడా వ్యాఖ్యానించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..