Third Front: బీజేపీకి వ్యతిరేకంగా థర్డ్ ఫ్రంట్‌ ఏర్పాటుకు ప్రతిపక్షాల వ్యూహం.. కాంగ్రెస్ లేకుండా కూటమి అసాధ్యమని తేల్చిన శరద్ పవార్!

|

Jun 26, 2021 | 12:40 PM

కాంగ్రెస్ పార్టీ లేకుండా మరో కూటమి అసాధ్యమని సీనియర్ నేత, ఎన్‌సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ స్పష్టం చేశారు.

Third Front: బీజేపీకి వ్యతిరేకంగా థర్డ్ ఫ్రంట్‌ ఏర్పాటుకు ప్రతిపక్షాల వ్యూహం.. కాంగ్రెస్ లేకుండా కూటమి అసాధ్యమని తేల్చిన శరద్ పవార్!
Ncp President Sharad Pawar
Follow us on

NCP Chief Sharad Pawar on Third Front: కాంగ్రెస్ పార్టీ లేకుండా మరో కూటమి అసాధ్యమని సీనియర్ నేత, ఎన్‌సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ స్పష్టం చేశారు. అధికారంలో ఉన్న బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని ఎదుర్కొవాలంటే అన్నీ పార్టీలతో కలసి పనిచేయాల్సిన అవసరముందన్నారు. పవార్ నివాసంలో ఇటీవల జరిగిన సమావేశం తర్వాత థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుపై ఊహగానాలు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో శరద్ పవార్ తాజాగా స్పందించారు. రాష్ట్ర మంచ్‌ సమావేశంలో మూడో కూటమి గురించి చర్చించలేదన్నారు. కానీ, ప్రత్యామ్నాయ ఫ్రంట్ ప్రస్తావన వచ్చిందని మాత్రం క్లారిటీ ఇచ్చారు. బీజేపీని ఎదుర్కోవాలంటే కాంగ్రెస్‌‌ను కలుపుకుని వెళ్తేనే సాధ్యమవుతుందని సూచించినట్లు ఆయన పేర్కొన్నారు. కొత్త ఏర్పడే కూటమికి సమిష్టి నాయకత్వం అవసరమని వ్యాఖ్యానించారు. అయితే, కూటమికి మీరు నాయకత్వం వహిస్తారా? అన్న ప్రశ్నకు పవార్ సమాధానం దాటవేశారు. శరద్ పవార్ ఇంతకు ముందు చాలాసార్లు ప్రయత్నించారని అన్నారు.

ఇదిలావుంటే, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఇటీవల ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్‌తో వరుసగా భేటీ కావడంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ మొదలైంది. కానీ, మంగళవారం జరిగిన సమావేశాన్ని పరిశీలిస్తే ఆసక్తికరంగా మారింది. మాజీ కేంద్ర మంత్రి యశ్వంత్ సిన్హా స్థాపించిన రాష్ట్ర మంచ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి పవార్ నేతృత్వం వహించారు. మొత్తం ఎనిమిది రాజకీయ పార్టీలు, సినీ, న్యాయ ప్రముఖులు, జర్నలిస్ట్‌లు హాజరయ్యారు. అయితే, ఈ సమావేశానికి కాంగ్రెస్ నేతలు ఎవరూ హాజరుకాలేదు. దీంతో కాంగ్రెస్ లేదా బీజేపీకి ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రచారం జరుగుతోంది.

ఈ ఊహాగానాలకు శరద్ పవార్ తెరదించారు. థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుపై చర్చించలేదు కానీ, బీజేపీ వ్యతిరేక కూటమికి సమిష్టి నాయకత్వం అవసరమని స్పష్టం చేశారు. రాజకీయ మంత్రాంగంలో శరద్ పవార్‌ది అందవేసిన చేయి. మహారాష్ట్రలో సిద్ధాంతపరంగా భిన్నమైన శివసేన.. ఎన్‌సీపీ-కాంగ్రెస్‌లు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడంలో పవార్ కీలక పాత్ర పోషించారు.

Read Also….Corona Delta Plus: తిరుపతిలో డెల్టా ప్లస్ వేరియంట్‌‌ తొలి కేసు.. అప్రమత్తమైన రాష్ట్ర సర్కార్.. స్థానికుల నమూనాలు సేకరిస్తున్న అధికారులు!