Central Govt: ఆ విషయంలో రాష్ట్రాలదే నిర్ణయాధికారం.. లోక్ సభలో స్పష్టమైన ప్రకటన చేసిన కేంద్ర ప్రభుత్వం..

Central Govt: లవ్ జిహాద్ పేరులో దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలు తీసుకువస్తున్న చట్టాలు వివాదాస్పదం అవుతున్న నేపథ్యంలో

Central Govt: ఆ విషయంలో రాష్ట్రాలదే నిర్ణయాధికారం.. లోక్ సభలో స్పష్టమైన ప్రకటన చేసిన కేంద్ర ప్రభుత్వం..

Updated on: Feb 03, 2021 | 4:30 AM

Central Govt: లవ్ జిహాద్ పేరులో దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలు తీసుకువస్తున్న చట్టాలు వివాదాస్పదం అవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఆయా చట్టాలపై రాష్ట్రాలదే నిర్ణయాధికారం అని తేల్చి చెప్పింది. మత మార్పిడిలు, రాష్ట్రాలు తీసుకువస్తున్న చట్టాలపై లోక్‌సభలో ప్రభుత్వాన్ని పలువురు ప్రజాప్రతినిధులు ప్రశ్నించారు. దీనికి స్పందించిన కేంద్ర ప్రభుత్వం.. తమ మార్పిడులకు సంబంధించిన అంశాలపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయం తీసుకుంటాయని స్పష్టం చేసింది. మత మార్పిడులకు సంబంధించి ఎక్కడైనా నిబంధనల ఉల్లంఘనలు జరిగితే ఆయా రాష్ట్రాల పోలీసులు, అధికారులు తగు చర్యలు తీసుకుంటారని లోక్‌సభలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. అయితే, ఇలాంటి చట్టాలను తీసుకువచ్చే ఆలోచనలేవీ కేంద్రానికి లేదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. కాగా, లవ్ జిహాద్ పేరులో కొన్ని వర్గాల వారు మత మార్పిడీలు ప్రొత్సహిస్తున్నారని ఆరోపిస్తూ దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలు యాంటీ లవ్ జీహాద్ చట్టాలను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్, హర్యానా, కర్ణాటక రాష్ట్రాలు ఈ చట్టాలను తీసుకువచ్చేందుకు అమితాసక్తిని కనబరుస్తున్నాయి. ఇప్పటికే యూపీలో ఈ చట్టం అమల్లో ఉండగా.. కొందరిని ఈ చట్టం ప్రకారం అరెస్ట్ కూడా చేశారు.

Also read:

Subsidy Cancel: ప్రజలకు షాక్ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం.. ఏప్రిల్ 1 నుంచి మొత్తం చెల్లించాల్సిందే..

Central Govt: వైద్యుల ఆందోళనలు.. క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం.. అసలు విషయం ఏంటంటే..