కరోనాపై ఆందోళన వద్దు.. రక్షణకు చిన్న చిట్కాలు పాటిస్తే మేలు.. మోదీ

| Edited By: Pardhasaradhi Peri

Mar 03, 2020 | 6:13 PM

ఇండియాలో కొన్ని రాష్ట్రాలను తాకిన కరోనా వైరస్ పై ప్రధాని మోదీ.. మంగళవారం ఢిల్లీలో ఉన్నత స్థాయి సమావేశంలో సమీక్ష జరిపారు.

కరోనాపై ఆందోళన వద్దు.. రక్షణకు చిన్న చిట్కాలు పాటిస్తే మేలు.. మోదీ
Follow us on

ఇండియాలో కొన్ని రాష్ట్రాలను తాకిన కరోనా వైరస్ పై ప్రధాని మోదీ.. మంగళవారం ఢిల్లీలో ఉన్నత స్థాయి సమావేశంలో సమీక్ష జరిపారు. ఈ వ్యాధిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని,  దీని నివారణకు అంతా కలిసికట్టుగా కృషి చేద్దామని ట్వీట్ చేశారు. ప్రజలు స్వీయ రక్షణకు కొన్ని సాధారణ చర్యలు తీసుకుంటే సరిపోతుందని అన్నారు. ఈ వైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఓ గ్రాఫిక్ ని కూడా ఆయన షేర్ చేశారు. విదేశాల నుంచి మన దేశానికి వచ్ఛే ప్రయాణికులను క్షుణ్ణంగా స్క్రీనింగ్ చేస్తున్నారని, మెడికల్ అటెన్షన్ ని అధికారులు బాధ్యతగా చేపడుతున్నారని మోదీ పేర్కొన్నారు. అంతకుముందు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తో సమావేశమైనప్పుడు కూడా ఇద్దరి మధ్యా కరోనా నివారణే ప్రధాన చర్చనీయాంశమైంది. మోదీతో భేటీ అయిన అనంతరం కేజ్రీవాల్.. ఆరోగ్య శాఖ మంత్రితో కూడా సమావేశమై .. ఢిల్లీ నగరంలో ఈ వ్యాధి నివారణకు తీసుకోవలసిన చర్యలపై చర్చించారు.

కాగా-కరోనా వ్యాప్తిపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేస్తూ.. ట్వీట్ చేశారు. ప్రభుత్వం ఈ ముప్పును తీవ్రమైనదిగా పరిగణించడం లేదన్నారు. రాజస్థాన్ ఆరోగ్య శాఖ మంత్రి రఘుశర్మ.. జైపూర్ చేరుకున్న ఓ ఇటాలియన్ టూరిస్టుకు కరోనా సోకినట్టు సమాచారం అందిందన్నారు.