ఇకపై టెస్టు లేకుండానే డ్రైవింగ్ లైసెన్స్ జారీ.! కొత్త నిబంధనలు సిద్దం చేస్తోన్న కేంద్రం..

Driving License Government: మీరు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలా.? అయితే ఒక్క నిమిషం ఆగండి. ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాల్సిన అవసరం లేదు...

ఇకపై టెస్టు లేకుండానే డ్రైవింగ్ లైసెన్స్ జారీ.! కొత్త నిబంధనలు సిద్దం చేస్తోన్న కేంద్రం..

Updated on: Feb 06, 2021 | 9:06 PM

Driving License Government: మీరు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలా.? అయితే ఒక్క నిమిషం ఆగండి. ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం తాజాగా ఈ ప్రక్రియలో కీలక మార్పు తీసుకురాబోతోంది. ఇకపై డ్రైవింగ్ టెస్టు లేకుండానే డ్రైవింగ్ లైసెన్స్‌‌ను జారీ చేయనుంది. ఈ మేరకు కేంద్ర రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ కొత్త నిబంధనలను తీసుకొస్తోంది. డ్రైవింగ్ స్కూళ్లలో డ్రైవింగ్ నేర్చుకుంటే చాలు లైసెన్స్ పొందొచ్చు. ఇందుకు సంబంధించి ఓ పధకాన్ని అమలులోకి తీసుకురానుంది. ఈ క్రమంలోనే కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ప్రజల సలహా కోరుతూ ముసాయిదా నోటిఫికేషన్‌ను జారీ చేసింది.

డ్రైవింగ్ శిక్షణా కేంద్రాలు గుర్తింపు..

దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం డ్రైవింగ్ శిక్షణా కేంద్రాలను గుర్తించనుంది. అవి ప్రభుత్వం రూపొందించిన నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. వీటిల్లో నాణ్యతతో కూడిన డ్రైవింగ్ శిక్షణను అందించనున్నారు. ఈ క్రమంలోనే ప్రజల సూచన కోసం, కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ముసాయిదా నోటిఫికేషన్‌ను తన వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసింది. ఇందులో, మీరు మీ సలహాలను కూడా ఇవ్వవచ్చు. అటు డ్రైవింగ్ స్కూళ్లకు అక్రిడిటేషన్ కోసం డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం పరిగణనలో నడిచే ఈ శిక్షణా కేంద్రాల్లో ట్రైనింగ్ పూర్తి చేస్తే డ్రైవింగ్ టెస్టు లేకుండానే లైసెన్స్ జారీ చేయనున్నారు. దీని ద్వారా రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని కేంద్రం భావిస్తోంది.

Also Read: అల్లు అర్జున్ కార్వాన్‏ను ఢీకొట్టిన లారీ.. ఖమ్మం సమీపంలో రోడ్డు ప్రమాదం..