Nirmala Sitharaman: ఆరోగ్య రంగానికి రూ.50వేల కోట్లు ప్రకటించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌

|

Jun 28, 2021 | 7:20 PM

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ విలేకరుల సమావేశంలో ప్రసంగిస్తున్నారు.

Nirmala Sitharaman: ఆరోగ్య రంగానికి రూ.50వేల కోట్లు ప్రకటించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌
Fm Nirmala Sitharaman
Follow us on

Nirmala Sitharaman: కరోనా సెకండ్ వేవ్ తో నష్టపోయిన భారత ఆర్థిక వ్యవస్థకు ఊతమించ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఉద్దీపనలు ప్రకటించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, సహాయ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ నేడు విలేకరుల సమావేశంలో పలు కీలక నిర్ణయాలను వెల్లడించారు. ఆరోగ్య సేవలు మెరుగుపరచడంపై స్పెషల్ ఫోకస్ చేసినట్లు తెలిపారు.

8 రిలీఫ్‌ ప్యాకేజీలను కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించారు.

ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో వైద్యసౌకర్యాల కల్పన విస్తరణ

కొవిడ్‌ ప్రభావిత రంగాలకు రూ.1.1 లక్షల కోట్ల రుణ హామీ

వైద్య రంగానికి రూ.50 వేల కోట్ల కేటాయింపు.

ఇతర రంగాలకు రూ.60 వేల కోట్ల కేటాయింపు.

వైద్య, ఆరోగ్యశాఖకు సాయం చేసే సంస్థలకు మరింత అండగా ఉండనున్నట్లు తెలిపారు.

వైద్య, ఔషధ రంగాల్లో మౌలిక వసతుల అభివృద్ధి కొత్త ప్రాజెక్టులకు రుణం అందజేయనున్నట్లు ప్రకటించారు.

ఆత్మనిర్భర్‌ భారత్‌ కార్యక్రమంలో భాగంగా ఎమర్జెన్సీ క్రెడిట్‌లైన్‌ గ్యారెంటీ స్కీమ్‌(ఈసీఎల్‌జీఎస్‌) అమలు చేయనున్నట్లు పేర్కొంది. దీని కింద అత్యవసర రుణాలకు గాను రూ.1.5 లక్షల కోట్లు అందించనున్నట్లు తెలిపారు.

ఈసీఎల్‌జీఎస్‌లో భాగంగా సూక్ష్మరుణ సంస్థల ద్వారా 25 లక్షల మందికి రూ.1.25 లక్షల రుణం. దీనికి వడ్డీ గరిష్ఠంగా ఎంసీఎల్‌ఆర్‌+2శాతం. మూడు సంవత్సరాల పరిమితితో ఇవ్వనున్నట్లు పేర్కొంది.

పర్యాటక రంగంలో స్థిరపడిన వారికి అండగా నిలిచేందుకు వర్కింగ్‌ క్యాపిటల్‌/వ్యక్తిగత రుణాలు.

రిజిస్టర్‌ చేసుకున్న టూరిస్ట్‌ గైడ్‌లు, పర్యాటక రంగంపై ఆధారపడిన 11,000 మందికి ఆర్థిక సాయం.

ఆత్మనిర్భర్‌ రోజ్‌గార్‌ యోజన పథకాన్ని వచ్చే ఏడాది మార్చి 31 వరకు పొడిగింపు.

కృత్రిమ ఎరువులకు రూ.14,775 కోట్ల మేర అదనపు రాయితీలు. డీఏపీకి రూ.9,125 కోట్లు, నత్రజనికి రూ.5,650 కోట్లు.

ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజన కింద (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ లబ్ధిదారులకు) మే నుంచి నవంబరు వరకు 5 కిలోల ఆహార ధాన్యాలు ఉచితంగా అందిచనుంది.

అంతర్జాతీయ ప్రయాణాలు ప్రారంభమైన తర్వాత, దేశానికి వచ్చే తొలి 5 లక్షల మంది పర్యాటకులు వీసా ఫీజు రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ఈ స్కీం 31 మార్చి, 2022 వరకు అందుబాటులో ఉండనుంది. లేదా మొదటి 5 లక్షల వీసాలకు మాత్రమే వర్తిస్తుంది.
దీనిలో భాగంగా ఒక పర్యాటకుడు ఒకసారి మాత్రమే ఉపయోగించుకునేట్లు నిబంధనలు విధించినట్లు తెలిపారు.

ప్రజారోగ్యం కోసం రూ .23,220 కోట్లు అదనంగా కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. వీటిని ఈ ఫైనాన్స్ ఇయర్ లోనే ఉపయోగించనున్నట్లు తెలిపారు. వీటిలో పిల్లలు, వారి సంరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుందని పేర్కొన్నారు.