నిర్భయ కేసు… తీహార్ జైల్లో డమ్మీ ట్రయల్స్

| Edited By: Srinu

Jan 28, 2020 | 1:47 PM

ఢిల్లీలో సంచలనం రేపిన నిర్భయ హత్యాచారం కేసుకు సంబంధించి దోషులను ఉరితీసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఉరి ప్రక్రియకు సంబంధించిన ట్రయల్స్‌ను తీహార్ జైలు సోమవారం అధికారులు పూర్తి చేశారు. ఇందులో భాగంగా నిన్న డమ్మీలను ఉరితీశారు. డమ్మీలు అంటే.. దోషుల సమాన బరువున్న ఇసుక బస్తాలను గానీ, గోధుమ బస్తాలను గానీ లేదా ఇతర వస్తువులను సంచిలో నింపి ఉరితీస్తారు. ఉరికి సంబంధించినవన్నీ సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో చెక్ చేసుకోవడానికి ఇలా డమ్మీలను ఉరితీస్తారు. నిజానికి […]

నిర్భయ కేసు... తీహార్ జైల్లో డమ్మీ ట్రయల్స్
Follow us on

ఢిల్లీలో సంచలనం రేపిన నిర్భయ హత్యాచారం కేసుకు సంబంధించి దోషులను ఉరితీసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఉరి ప్రక్రియకు సంబంధించిన ట్రయల్స్‌ను తీహార్ జైలు సోమవారం అధికారులు పూర్తి చేశారు. ఇందులో భాగంగా నిన్న డమ్మీలను ఉరితీశారు. డమ్మీలు అంటే.. దోషుల సమాన బరువున్న ఇసుక బస్తాలను గానీ, గోధుమ బస్తాలను గానీ లేదా ఇతర వస్తువులను సంచిలో నింపి ఉరితీస్తారు. ఉరికి సంబంధించినవన్నీ సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో చెక్ చేసుకోవడానికి ఇలా డమ్మీలను ఉరితీస్తారు.

నిజానికి ఈ నెల 22న వినయ్ శర్మ, అక్షయ్ కుమార్ సింగ్, ముఖేష్ కుమార్ సింగ్, పవన్‌లను ఉరితీయాల్సి ఉన్నా.. దోషుల పిటిషన్ మేరకు వాయిదా వేసి ఉరి ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం ఆరు గంటలకు శిక్షణు అమలు పరచనున్నారు. కాగా.. ఈ రోజు నిర్భయ దోషి ముఖేష్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు విచారణ చేపట్టనుంది. తన క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ నలుగురు దోషుల్లో ఒకడైన ముఖేశ్ కుమార్ శనివారం అత్యున్న న్యాయ స్థానంలో పిటిషన్ దాఖలు చేశాడు.