ముకేష్ మెర్సీ పిటిషన్.. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కూడా..

| Edited By: Pardhasaradhi Peri

Jan 16, 2020 | 1:49 PM

నిర్భయ కేసు నలుగురు దోషుల్లో ఒకరైన ముకేశ్ సింగ్ దాఖలు చేసిన క్షమాభిక్ష పిటిషన్ ను ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ కూడా తిరస్కరించారు. మొదట ఇతని పిటిషన్ ని ఢిల్లీ ప్రభుత్వం తోసిపుచ్చి .. దీన్ని తిరస్కరించవలసిందిగా సిఫారసు చేస్తూ.. అనిల్ బైజాల్ కు పంపింది. ఆ సిఫారసు మేరకు ఆయన కూడా ఈ పిటిషన్ ను తోసిపుచ్ఛుతూ .. కేంద్ర హోం శాఖకు పంపారు.  ఈ నలుగురు దోషుల డెత్ వారెంట్ పై […]

ముకేష్ మెర్సీ పిటిషన్.. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కూడా..
Follow us on

నిర్భయ కేసు నలుగురు దోషుల్లో ఒకరైన ముకేశ్ సింగ్ దాఖలు చేసిన క్షమాభిక్ష పిటిషన్ ను ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ కూడా తిరస్కరించారు. మొదట ఇతని పిటిషన్ ని ఢిల్లీ ప్రభుత్వం తోసిపుచ్చి .. దీన్ని తిరస్కరించవలసిందిగా సిఫారసు చేస్తూ.. అనిల్ బైజాల్ కు పంపింది. ఆ సిఫారసు మేరకు ఆయన కూడా ఈ పిటిషన్ ను తోసిపుచ్ఛుతూ .. కేంద్ర హోం శాఖకు పంపారు.  ఈ నలుగురు దోషుల డెత్ వారెంట్ పై స్టే ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించిన సంగతి తెలిసిందే.

ఈ నెల 22 న ఉదయం 7 గంటలకు వీరిని ఉరి తీయకపోవచ్ఛునని ఢిల్లీ ప్రభుత్వం కోర్టుకు తెలియజేసింది. నిబంధనల ప్రకారం ముకేశ్ ఉరి శిక్షకు 14 రోజుల ముందు అతనికి నోటీసు జారీ చేయాల్సి ఉందని ప్రభుత్వం తరఫు లాయర్ రాహుల్ మెహ్రా  స్పష్టం చేశారు. ఇలా ఉండగా..  ఈ దోషుల ఉరితీత కోసం తహతహలాడుతున్న మీరట్ తలారి పవన్ జలాద్ ను  తాజా పరిణామాలు అయోమయంలో పడేస్తున్నాయి. వీరిని ఉరి తీస్తే వచ్ఛే పారితోషికంతో తన కూతురి పెళ్లి చేయవచ్చునని ఆయన గంపెడాశతో ఉన్నారు. అయితే ఈ నెల 22 న వీరిని ఉరితీసే అవకాశం లేదని వస్తున్న వార్తలు ఆయనను షాక్ కి గురి చేశాయి.