నిర్భయ దోషులకు రేపే ఉరి.. పటియాలా హౌస్ కోర్టు వద్ద హైడ్రామా

| Edited By: Pardhasaradhi Peri

Mar 19, 2020 | 3:52 PM

నిర్భయ కేసులో దోషులు నలుగురినీ ఉరి తీయడానికి సమయం దగ్గర పడుతుండడంతో గురువారం ఢిల్లీ పటియాలా హౌస్ కోర్టు వద్ద కొద్దిసేపు హైడ్రామా నెలకొంది.

నిర్భయ దోషులకు రేపే ఉరి.. పటియాలా హౌస్ కోర్టు వద్ద హైడ్రామా
Follow us on

నిర్భయ కేసులో దోషులు నలుగురినీ ఉరి తీయడానికి సమయం దగ్గర పడుతుండడంతో గురువారం ఢిల్లీ పటియాలా హౌస్ కోర్టు వద్ద కొద్దిసేపు హైడ్రామా నెలకొంది. దోషుల్లో ఒకడైన అక్షయ్ సింగ్ భార్య పునీతా దేవి.. అక్కడికి చేరుకొని పెద్దపెట్టున శోకాలు పెడుతూ.. స్పృహ కోల్పోయింది. స్పృహ లోకి వఛ్చిన తరువాత.. చెప్పులతో తనను తాను కొట్టుకుంటూ.. తనకు బతకాలని లేదని, ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించింది. తన వెంట వఛ్చిన బంధువులు వారించినా ఆమె శాంతించలేదు. ఉరి శిక్షకు గురైన ఒక వ్యక్తికి భార్యగా ఉండదలచ లేదని, తనకు డైవోర్స్ ఇప్పించాలని ఆమె బీహార్ లోని స్థానిక కోర్టులో ఓ పిటిషన్ కూడా దాఖలు చేసిన సంగతి తెలిసిందే..

కాగా ఈ దోషుల న్యాయపరమైన మార్గాలన్నీ మూసుకుపోయాయని, ఇక మీరు శిక్ష అనుభవించాల్సిందేఅని పాటియాలా హౌస్ కోర్టు పేర్కొంది. వారి పిటిషన్లను కొట్టివేసింది.తమ డెత్ వారెంట్లను సవాలు చేస్తూ వారు కోర్టుకెక్కారు. అంతకు ముందు సుప్రీంకోర్టులో కూడా దోషి పవన్ గుప్తా వేసిన క్యురేటివ్ పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది.