తల్లిదండ్రుల మధ్య నలిగి.. 23 రోజుల పసికందు మృతి!

Newborn Dies After Crushed Between Parents: నిద్రపోతున్న తల్లిదండ్రుల మధ్య నలిగి 26 రోజుల శిశువు మృతి చెందింన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమరోహా జిల్లా సిహాలి జాగీర్‌ గ్రామంలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..

తల్లిదండ్రుల మధ్య నలిగి.. 23 రోజుల పసికందు మృతి!
Newborn Dies After Crushed Between Parents

Updated on: Dec 11, 2025 | 7:38 PM

అమ్రోహా, డిసెంబర్‌ 11: ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లా సిహాలి జాగీర్‌ గ్రామానికి సద్దామ్‌ అబ్బాసి (25) అనే వ్యక్తికి ఏడాది క్రితం ఆస్మా అనే యువతితో వివాహం జరిగింది. వీరికి గత నెల నవంబర్‌ 10న మగశిశువు (23 రోజులు) జన్మించింది. అయితే ఆస్మా మగబిడ్డకు జన్మనిచ్చిన కొన్ని రోజులకే బిడ్డకు శ్వాస సమస్య తలెత్తినట్లు గుర్తించింది. దీంతో ఆస్పత్రిలో కొన్ని రోజులు చిన్నారికి వైద్యం అందించారు. పరిస్థితి మెరుగయ్యాక దంపతులు బిడ్డను తీసుకుని ఇంటికి వచ్చారు. అయితే కొద్దిరోజుల తర్వాత కామెర్లు రావడంతో మరోసారి ఆస్పత్రిలో చికిత్స అందించారు. తాజాగా వారి బిడ్డకు పేరు పెట్టుకుని నామకరణం కూడా చేశారు.

అయితే గత శనివారం రాత్రి అబ్బాసి, అతని భార్య ఆస్మా.. వీరిద్దరి మధ్యలో చిన్నారిని పడుకోబెట్టుకుని నిద్రపోయారు. అయితే ఏం జరిగిందో తెలియదుగానీ ఆదివారం ఉదయం బిడ్డకు పాలు తాగించాలని చూసిన ఆస్మా.. బిడ్డ కదలక పోవడం చూసి షాకైంది. వెంటనే భర్తను తీసుకుని గజ్రౌలా కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌కు వెళ్లారు. అక్కడి వైద్యులు పరీక్షించి అప్పటికే బిడ్డ మృతి చెందినట్లు ధృవీకరించారు. ఊపిరాడక శిశువు మరణించిందని ఆరోగ్య కేంద్రంలోని వైద్యులు తెలిపారు. రాత్రిపూట నిద్రలో ప్రమాదవశాత్తు తల్లిదండ్రుల మధ్య బిడ్డ నలిగి ఊపిరాడక మృతి చెంది ఉండవచ్చని పీడియాట్రిక్‌ డాక్టర్‌ అమిత్ వర్మ తెలిపారు. అందుకే నవజాత శిశువులను విడివిడిగా పడుకోబెట్టాలని సూచించారు.

ఈ విషయం చెప్పగానే బిడ్డ తల్లిదండ్రులు షాక్‌కు గురై ఆసుపత్రిలోనే కొద్దిసేపు వాగ్వాదానికి దిగారు. కానీ తరువాత కుటుంబ సభ్యులు వారిని ఓదార్చారు. ఈ విషయంలో పోలీసులకు ఎటువంటి ఫిర్యాదు నమోదు కాలేదని అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.