ప్రముఖ మొబైల్ కంపెనీ లావా మరో కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్‌ను భారత్‌లో ప్రకటించింది. లావా బీయూ ఆండ్రాయిడ్ గో ఎడిషన్ స్మా్ర్ట్ ఫోన్‌ను కొత్తగా మార్కెట్లోకి తీసుకురానుంది. ఇది మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించినట్లుగా తెలుస్తోంది.
ప్రస్తుతం మహిళలు ఎదుర్కోంటున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ప్రముఖ మొబైల్ బ్రాండ్ సంస్థ లావా మరో స్మార్ట్ ఫోన్‌ను రూపొందించింది. ఇందులో మహిళల కోసం ప్రత్యేకంగా ఓ యాప్‌ను కూడా డిజైన్ చేశారు. ఈ యాప్‌ను ఎలా ఉపయోగించాలి అనే విషయాన్ని కూడా ఇందులో తెలపనున్నారు.
మొత్తంగా 6.08 అంగుళాల హెచ్డీ ప్లస్ డిస్ ప్లే ఉండగా.. స్క్రీన్ రిజల్యూషన్ 1560 x 720 పిక్సెల్స్‌గా ఉండనుంది. యాస్పెక్ట్ రేషియో 19.5:9గా.. 1.6 గిగాహెర్ట్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్‌ను ఈ ఫోన్లో అందించారు. దీన్ని మైక్రోఎస్‌డీ కార్డు ద్వారా 256 జీబీ వరకు పెంచుకునే అవకాశం కల్పించారు. ఇక వెనకవైపు రెండు కెమెరాలు ఉండగా.. మెయిన్ కెమెరా 13 మెగాపిక్సెల్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, ఎల్ఈడీ ఫ్లాష్ అందుబాటులో ఉంచారు. ఇక ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. ఆండ్రాయిడ్ 10గో ఆపరేటింగ్ సిస్టం పై ఈ ఫోన్ పనిచేయనుంది.