చెత్తను తీస్తున్న పనిలో మున్సిపల్ సిబ్బంది నిమగ్నమై ఉండగా.. వారికి ఓ ప్లాస్ట సంచి కనిపించింది. అది బరువెక్కి ఉండటంతో.. అందులో ఏముందా అని ఓ కార్మికురాలు దాన్ని తెరిచి చూసింది. అంతే! ఇలా చూసిందో లేదో.. అలా షాకై కళ్లు తేలేసింది. అందులో రెండు లేదా మూడు రోజుల వయస్సు ఉన్న నవజాత శిశువు మృతదేహం మున్సిపల్ సిబ్బందికి కనిపించింది. ఈ అవమానీయ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్‌లోని ఏరోడ్రోమ్ ప్రాంతంలో ఉన్న చెత్తను సేకరిస్తున్న మున్సిపల్ సిబ్బందికి ఓ ప్లాస్టిక్ కవర్ కనిపించింది. ఇక ఆ సంచి బరువెక్కి ఉండటంతో.. అక్కడున్న కార్మికురాలు ఒకరు అనుమానంతో అందులో ఏముందా అని చెక్ చేయగా.. లోపల కనిపించిన దృశ్యాన్ని చూసి ఒక్కసారిగా కంగుతిన్నది. అందులో వారికి రెండు లేదా మూడు రోజుల వయస్సు ఉన్న నవజాత శిశువు మృతదేహం కనిపించింది. వెంటనే ఈ ఘటనపై మున్సిపల్ అధికారులు పోలీసులకు సమాచారాన్ని అందించారు.
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. ఆడపిల్ల అనే కారణంతో చెత్తబుట్టలో పడేశారా.? లేదా వేరే ఏదైనా కారణం ఉందా.? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ దారుణానికి ఒడిగట్టిన వారికి కచ్చితంగా పట్టుకుని తీరుతామని పోలీసులు తెలిపారు.