Kumbhamela: ఫిబ్రవరి 27 నుంచి ఏప్రిల్ 30 వరకు హరిద్వార్‌లో జరిగే కుంభమేళానికి భక్తులు నెగటివ్ ఆర్టీ-పీసీఆర్ రిపోర్టులు తీసుకురావాలని కేంద్రం ఆదేశించింది. కుంభమేళాలో పాటించాల్సిన నిబంధనలకు సంబంధించిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసిజర్ (ఎస్‌వోపీ)ని విడుదల చేసింది. కుంభమేళాకు వెళ్లే అన్ని దారుల్లో మాస్కులను పంపిణీ చేస్తామన్నారు. కొవిడ్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కుంభమేళాకు రానున్న భక్తులు హరిద్వార్‌కు చేరుకొనే 72గంటల్లోపు ఆర్టీపీసీఆర్ టెస్టులు చేసుకొని రావాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆదేశాలు జారీ చేసింది.
వీలైనంత వరకూ ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించాలని వారు సూచించారు. 65ఏళ్లకు పైబడినవారు, చిన్నారులు, గర్భిణులకు కుంభమేళాకు అనుమతి లేదన్నారు. కుంభమేళా నిర్వాహకులు ఎప్పటి కప్పుడు శానిటైజ్ చేస్తూ పర్యవేక్షిస్తారని వారు తెలిపారు. నిర్వాహకులు ఇప్పటికే 1,000 మంచాలతో కూడిన తాత్కాలిక ఆస్పత్రిని ఏర్పాటు చేశారని తెలిపారు. అంబులెన్సులు ఎక్కడికక్కడ అందుబాటులో ఉంటాయని ప్రభుత్వం వెల్లడించింది.
కొత్త సంవత్సరం నుంచి టోల్‌ప్లాజా వద్ద నో క్యాష్.. ఇకనుంచి అలాగే చెల్లింపులు.. సిద్దమవుతున్న కేంద్రం