‘సమస్య జటిలం.. అయినా సమష్టి పోరాటమే శరణ్యం’.. కరోనాపై మోదీ

| Edited By: Anil kumar poka

Mar 15, 2020 | 6:09 PM

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనాపై సార్క్ సభ్య దేశాలు ఉమ్మడిగా పోరాటం జరపాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఆదివారం సాయంత్రం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ దేశాధినేతలను ఉద్దేశించి మాట్లాడుతూ..

సమస్య జటిలం.. అయినా సమష్టి పోరాటమే శరణ్యం.. కరోనాపై మోదీ
Follow us on

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనాపై సార్క్ సభ్య దేశాలు ఉమ్మడిగా పోరాటం జరపాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఆదివారం సాయంత్రం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ దేశాధినేతలను ఉద్దేశించి మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం ఈ వైరస్ నివారణకు అన్ని చర్యలూ తీసుకుందని చెప్పారు. అయినా అప్రమత్తంగా ఉండాలని భావిస్తున్నామని, సమస్యను నిర్లక్ష్యం చేయరాదన్నదే తమ భావన అని అన్నారు. సార్క్ సభ్య దేశాలన్నీ కోవిడ్-19 ని ఉమ్మడిగా ఎదుర్కొనేందుకు ఓ సమగ్ర వ్యూహాన్ని రూపొందించాలని ఆయన సూచించారు. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే 5 వేల మందికి పైగా ఈ వ్యాధి బారిన పడి మరణించారని, సుమారు లక్షన్నర మందికి ఈ వ్యాధి లక్షణాలు సోకినట్టు తెలిసిందని ఆయన అన్నారు. మా దేశవ్యాప్తంగా ఎవేర్ నెస్ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం.. డయాగ్నస్టిక్ సెంటర్లను ఏర్పాటు చేసాం.. ఎంట్రీ పాయింట్ల వద్ద స్క్రీనింగ్, క్వారంటైన్, క్లియరింగ్ కేసుల్లో రోగుల డిశ్చార్జ్ వంటి వివిధ చర్యలు చేపట్టాం అని ఆయన వివరించారు. ఏమైనా సంసిధ్ధంగా ఉండాల్సిందేనని, కానీ భయాందోళన (ప్యానిక్) చెందరాదన్నదే తమ ‘మంత్ర’మని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వైరస్ నివారణలో ముందువెనుకలు ఆలోచించరాదన్నారు. సార్క్ లో ఇండియాతో బాటు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్, భూటాన్, మాల్దీవులు, శ్రీలంక, నేపాల్ సభ్యదేశాలుగా ఉన్నాయి. ఈ దేశాల్లో ఇప్పటివరకు 150 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇండియాలో ఈ కేసుల సంఖ్య 107  కి పెరిగింది. మహారాష్ట్రలో 31 కేసులు నమోదయ్యాయి.