Covid Care Coaches: దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ అల్లకల్లోలం సృష్టిస్తోంది. గతంలో ఎన్నడులేనంతగా తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. కరోనా రోగులతో ఆస్పత్రులన్నీ నిండిపోవడంతో బెడ్లు సైతం సరిపోవడం లేదు. కేసులు పెరుగుతుండటంతో ఆసుత్రుల్లో బెడ్లు, ఆక్సిజన్ కొరత ఏర్పడింది. దీంతో రోగులు నానా ఇబ్బందులకు గురవుతున్ననారు. ఈ నేపథ్యంలో నిత్యం లక్షలాది మందిని గమ్యస్థానాలకు చేర్చే రైల్వే బోగీలు మళ్లీ ఐసోలేషన్ వార్డులగా మారుతున్నాయి. గత ఏడాది ఇదే విధంగా చేసిన కేంద్ర ప్రభుత్వం.. రోగులకు ఆస్పత్రుల్లో బెడ్ల కొరత ఉండటంతో రైలు బోగీలను వార్డులుగా మార్చాలని నిర్ణయం తీసుకుంది. ఆస్పత్రుల్లో బెడ్ల కొరత ఉండటంతో రోగులు ఆస్పత్రి బయటే ప్రాణాలు వదులుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో భారత రైల్వే శాఖ రైల్వే కోచ్‌లను మరోసారి ఐసోలేషన్ కేంద్రాలుగా మారుస్తూ నిర్ణయం తీసుకుంది.
రాష్ట్ర ప్రభుత్వాల డిమాండ్ మేరకు ఈ కోచ్‌లను ఆయా ప్రాంతాల్లో అందుబాటులోకి తీసుకురానున్నట్టు రైల్వే శాఖ వెల్లడించింది. కోవిడ్ పేషెంట్ల కోసంఈ బోగీలను ఎనిమిది క్యాబిన్లుగా విభజించారు. ఒక్కో కోచ్‌లో16 బెడ్లను ఏర్పాటు చేశారు. ప్రతి కోచ్‌లో మూడు మరుగుదొడ్లు, దోమతెరలు, బయో టాయిలెట్లు, పవర్ సాకెట్లు, ఆక్సిజన్ సిలిండర్లు ఇలా అన్ని రకాల సౌకర్యాలతో రైలు బోగీలను ఏర్పాటు చేశారు. అలాగే రోగులకు ఫ్లూయిడ్ ఎక్కించేందుకు బాటిళ్లను, అదనపు బాటిల్ హోల్డర్లును, వాటిని వేలాడదీయడానికి క్లాంప్స్ను ఏర్పాటు చేశారు. దీనిపై రైల్వే మంత్రిత్వ శాఖ స్పందిస్తూ.. ‘ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్‌తో దేశం పోరాడుతున్నందున, కోవిడ్ కేర్ ఐసోలేషన్ కోచ్‌లను తిరిగి ప్రారంభించాలని రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఈ కోచ్‌లలో రోగుల వైద్యానికి కావాల్సిన అన్ని సౌకర్యాలను కల్పించాం. ఈ కోవిడ్ కేర్ కోచ్‌లు తేలికపాటి లక్షణాలతో బాధపడుతున్న కోవిడ్ రోగులను రక్షించేందుకు ఎంతగానో ఉపయోగపడతాయి. వేసవి కాలం కావడంతో వేడి నుంచి ఉపశమనం పొందేందుకు కూలర్లను ఏర్పాటు చేశాం’ అని పేర్కొంది.
కాగా, కరోనా మహమ్మారితో ఆస్పత్రుల్లో సైతం బెడ్ల కొరత ఉండటంతో రోగుల ప్రాణాలు కాపాడేందుకు ప్రస్తుతం 64వేల బెడ్లతో దాదాపు 4 వేల కోవిడ్ కేర్ కోచ్‌లను దేశంలోని వివిధ రైల్వే స్టేషన్లలో ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. వీటిలో కొన్ని ఇప్పటికే కరోనా ఫస్ట్ వేవ్‌లో రోగుల అవసరాలను తీర్చగా.. మరికొన్ని కొత్తగా ఏర్పాటు చేశారు. ఇక కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్న దేశ రాజధాని ఢిల్లీలోని శకుర్‌బస్తి స్టేషన్లో 800 బెడ్లతో కూడిన 50 కోచ్‌లు, మహారాష్ట్రలోని నందూర్బార్ జిల్లాలో 378 బెడ్లతో కూడిన 21 కోవిడ్ కేర్ కోచ్‌లను ఏర్పాటు చేశారు. ఇక వీటితో పాటు భోపాల్ స్టేషన్లో 20 బోగీలు, పంజాబ్‌లో 50 కోచ్‌లు, జబల్పూర్లో 20 కోచ్‌లు సిద్ధంగా ఉన్నాయని రైల్వే శాఖ తెలిపింది. అయితే రాష్ట్ర ప్రభుత్వాల డిమాండ్ మేరకు మరిన్ని రైల్వే కోచ్‌లను ఏర్పాటు చేస్తామని రైల్వే శాఖ ప్రకటించింది.
कोरोना संकट में Isolation Beds की आवश्यकता को देखते हुए भारतीय रेल ने देश भर में 4,000 COVID Care Coaches में 64,000 Beds तैयार किये हैं।
169 कोचेस के माध्यम से 2,700 से अधिक बेड्स राज्यों को हुए अब तक हुए उपलब्ध।
? https://t.co/R7UGlare84 pic.twitter.com/hFCxKckBHR
— Piyush Goyal (@PiyushGoyal) April 27, 2021