National lockdown: జాతీయ స్థాయి లాక్‌డౌన్? మరోసారి క్లారిటీ ఇచ్చిన నిర్మలా సీతారామన్.. ఏమన్నారంటే..?

Nirmala Sitharaman: దేశ వ్యాప్తంగా కరోనా రక్కసి విజృంభిస్తోంది. రోజువారీ కరోనా కేసుల సంఖ్య 3 లక్షలకు చేరువకావడంతో పలు రాష్ట్రాలు వీకెండ్ లాక్‌డౌన్, రాత్రిపూట కర్ఫ్యూ అమలు చేస్తున్నాయి. దీంతో

National lockdown: జాతీయ స్థాయి లాక్‌డౌన్? మరోసారి క్లారిటీ ఇచ్చిన నిర్మలా సీతారామన్.. ఏమన్నారంటే..?
Nirmala Sitharaman

Edited By: Team Veegam

Updated on: Apr 19, 2021 | 4:48 PM

Nirmala Sitharaman: దేశ వ్యాప్తంగా కరోనా రక్కసి విజృంభిస్తోంది. రోజువారీ కరోనా కేసుల సంఖ్య 3 లక్షలకు చేరువకావడంతో పలు రాష్ట్రాలు వీకెండ్ లాక్‌డౌన్, రాత్రిపూట కర్ఫ్యూ అమలు చేస్తున్నాయి. దీంతో దేశంలోని పలు ప్రాంతాల నుంచి వేరే ప్రాంతానికి వలస వచ్చిన కార్మికులు మళ్లీ భయాందోళన చెందుతున్నారు. ఈ మేరకు వారంతా స్వస్థలాలకు వెళ్లేందుకు సమయాత్తమవుతున్నారు. దీంతో రైల్వే స్టేషన్లు, రవాణా ప్రాంతాలన్నీ రద్దీగా ఉన్నాయి. ఈ కరోనా సెకండ్ వేవ్ కారణంగా పారిశ్రామిక వర్గాల్లో తీవ్ర ఆందోళన నెలకొంటోంది. కరోనా మహమ్మారి దేశ ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పారిశ్రామిక అసోసియేషన్ల ప్రతినిథులతో ఆన్‌లైన్ వీడియో కాన్ఫెరెన్స్‌ ద్వారా సోమవారం ఉదయం మాట్లాడారు.

ప్రభుత్వానికి లాక్‌డౌన్ విధించే ఆలోచన లేదంటూ.. ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టంచేశారు. కరోనా వైరస్ వ్యాప్తిపై ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటుందన్నారు. కోరోనా కట్టడి కోసం కేంద్రం పలు దఫాలుగా అధికారులతో సంప్రదించిందని తెలిపారు. అందరి అభివృద్ధి కోసం, జీవనోపాధి కోసం రాష్ట్రాలతో కలిసి ముందుకు సాగుతున్నట్లు వెల్లడించారు. కావున లాక్‌డౌన్ లాంటి విషయాలపై భయపడాల్సిన అవసరం లేదని.. కేంద్రానికి అలాంటి ఆలోచనే లేదంటూ నిర్మలా.. ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులతో పేర్కొన్నారు. ఈ మేరకు మంత్రి నిర్మలా సీతారామన్ పారిశ్రామిక అసోసియేషన్ల నుంచి పలు వివరాలను సేకరించారు.

నిర్మలా సీతారామన్ చేసిన ట్విట్..


ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. కోటక్ మహీంద్రా బ్యాంక్ సీఈఓ ఉదయ్ కోటక్, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ & ఇండస్ట్రీ (ఫిక్కీ) ప్రతినిధి ఉదయ్ శంకర్, బెంగాల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధి డెబ్ ముఖర్జీ, బెంగళూరు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధి టిఆర్ పరశురామన్, పవన్ ముంజాల్‌తో మాట్లాడారు.

Also Read: పదేళ్ల చిన్నోడితో పెళ్లి.. రెండేళ్లుగా కనిపించకుండాపోయిన భర్త.. కట్ చేస్తే.. ప్రియుడితో కలిసి కటకటల్లో భార్య

Delhi Curfew: ఢిల్లీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. రాజధానిలో కర్ఫ్యూ.. ఎప్పటినుంచంటే..?

ప్రైవేట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్… పీఎఫ్ డబ్బును పెంచుకోవడానికి అందుబాటులోకి మరిన్ని అవకాశాలు..