370 అధికరణం పునరుధ్దరణకై నా పోరాటం ఆగదు.,ఫరూక్ అబ్దుల్లా
జమ్మూ కాశ్మీర్ కి 370 అధికరణాన్ని పునరుధ్ధరించేంతవరకు తన పోరాటం ఆగదని మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా అన్నారు. తనను ఉరి తీసినా సరే తన లక్ష్యం మారదన్నారు. అటు-జమ్మూ కాశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ కి సంబంధించిన కోట్లాది స్కామ్ లో ఫరూక్ ప్రమేయంపై ఈడీ ఆయనను విచారించింది. ఈయనపై మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. ఆ అసోసియేషన్ కి సంబంధించి రూ. 40 కోట్ల సొమ్ము గోల్ మాల్ జరిగిందని ఈడీ […]
జమ్మూ కాశ్మీర్ కి 370 అధికరణాన్ని పునరుధ్ధరించేంతవరకు తన పోరాటం ఆగదని మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా అన్నారు. తనను ఉరి తీసినా సరే తన లక్ష్యం మారదన్నారు. అటు-జమ్మూ కాశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ కి సంబంధించిన కోట్లాది స్కామ్ లో ఫరూక్ ప్రమేయంపై ఈడీ ఆయనను విచారించింది. ఈయనపై మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. ఆ అసోసియేషన్ కి సంబంధించి రూ. 40 కోట్ల సొమ్ము గోల్ మాల్ జరిగిందని ఈడీ భావిస్తోంది. ఫరూక్ అబ్దుల్లాకు సమన్లు జారీ చేసింది. అయితే ఈ అంశం కోర్టు పరిశీలనలో ఉందని, దీనిపై తానేమీ వ్వ్యాఖ్యానించబోనని ఆయన పేర్కొన్నారు.