రోజుకు 65 లీటర్ల పాలిచ్చే ఆవు.. రూ.10కోట్లు విలువైన దున్నపోతు.. ర్యాంప్‌లో క్యాట్‌వాక్..!

|

Apr 07, 2023 | 6:04 PM

దేశం నలుమూలల నుంచి దాదాపు 1200 పశువులతో పాటు 50 వేల మంది రైతులు, పశుకాపరులు వచ్చారు. గేదెలు, ఆవులు, ఎద్దులు, గుర్రాలు, మేకలు, గొర్రెలు వంటి జంతువులను పోటీకి తరలించారు యజమానులు. గెలుపొందిన జంతువులు వరుసగా రూ. 5 లక్షలు, రూ. 2 లక్షలు,రూ. 1 లక్ష రివార్డులు అందుకున్నాయి.

రోజుకు 65 లీటర్ల పాలిచ్చే ఆవు.. రూ.10కోట్లు విలువైన దున్నపోతు.. ర్యాంప్‌లో క్యాట్‌వాక్..!
National Animal Pair 1
Follow us on

ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో భారతదేశంలోనే అతిపెద్ద జంతు ప్రదర్శన నిర్వహించారు. ఏప్రిల్ 6, 7 తేదీల్లో జరిగిన ఈ ప్రదర్శనలో దేశం నలుమూలాల నుంచి గేదెలు, ఆవులు, ఎద్దులు, గుర్రాలు, మేకలు, గొర్రెలు వంటి జంతువులను పోటీకి తరలించారు యజమానులు. గెలుపొందిన జంతువులు వరుసగా రూ. 5 లక్షలు, రూ. 2 లక్షలు,రూ. 1 లక్ష రివార్డులు అందుకున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా మొత్తం18 రకాల జంతువులకు ప్రైజ్ మనీగా దాదాపు రూ. 50 లక్షలు పంపిణీ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో ఇంత పెద్ద ఎత్తున జంతుప్రదర్శన నిర్వహించడం ఇదే తొలిసారి. ఈ ప్రదర్శనను కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్​ గడ్కరీ గురువారం ప్రారంభించారు.

నేషనల్ యానిమల్ ఎగ్జిబిషన్‌లో ర్యాప్‌లో షేరా మేక, కరిష్మా గేదె క్యాట్‌వాక్ సందర్శకులను ఆకట్టుకుంది. నూక్రి జాతి మేరే రేష్మా కూడా ర్యాప్‌లో దిగింది. షేరా మేక, కరిష్మా గేదెలు ర్యాప్‌లో క్యాట్‌వాక్ చేశాయి. జంతువుల అందాన్ని చూసి ప్రజలు చప్పట్లతో హోరెత్తించారు. మరోవైపు ఈ ప్రదర్శనలో పాల్గొన్న ఓ దున్నపోతు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రూ. 10 కోట్ల విలువ గల ఓ దున్నపోతు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. దీంతో ప్రదర్శనకు వచ్చిన వారంతా దీనిని ఆసక్తిగా తిలకించారు. అంతే కాకుండా రోజుకు 65 లీటర్ల పాలిచ్చే హైబ్రిడ్​ ఆవు కూడా మరో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ ఆవు రోజుకు మూడు సార్లు పాలు ఇస్తుందని దాని యజమాని తెలిపాడు. దీని ధర రూ.5 లక్షలకు పైగా ఉంటుందని చెప్పాడు. వీటితో పాటు ఈ ప్రదర్శనలో హరియాణాకు చెందిన ఆవులు, గేదెలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

National Animal Pair

దేశం నలుమూలల నుంచి దాదాపు 1200 పశువులతో పాటు 50 వేల మంది రైతులు, పశుకాపరులు వచ్చారు. వీరితో పాటు పలువురు శాస్త్రవేత్తలు కూడా పాల్గొన్నారు. ఈ మేళాకు వచ్చే వారి కోసం, పశువులు ఉండేందుకు కూడా ఏర్పాట్లు చేశారు. దీంతో పాటు 150 స్టాళ్లను ఏర్పాటు చేసి.. రైతులకు పశుపోషణ, వ్యవసాయానికి సంబంధించిన సమాచారాన్ని అందించారు. అందులో 75 స్టాళ్లలో వ్యవసాయ యంత్ర సామాగ్రి, డ్రోన్లు, వ్యవసాయ అంకురాల గురించి సమాచారం ఉంది. 40 డెయిరీ, పశుపోషణ, 15 ఫిషరీస్​, 20 ఐసీఏఆర్ ​(ఇండియన్ కౌన్సిల్​ ఆఫ్​ అగ్రికల్చరల్​ రీసెర్చ్)కు సంబంధించిన స్టాళ్లు ఏర్పాటు చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..