Animals rescue: అరుదైన పక్షులు, జంతువుల స్మగ్లింగ్‌.. రెస్క్యూ చేసిన అధికారులు.. వాటి ఖరీదు తెలిస్తే..

|

Dec 09, 2022 | 1:15 PM

అక్రమంగా రవాణా చేసి సొమ్ము చేసుకోవడానికి ప్రయత్నించిన కొందరు స్మగ్లర్ల ఆటకట్టించారు అటవీశాఖ అధికారులు. అటవీ శాఖ అధికారులతో కలిసి జంతు సంక్షేమ సంఘాలు స్మగ్లర్లను అడ్డుకున్నారు.

Animals rescue: అరుదైన పక్షులు, జంతువుల స్మగ్లింగ్‌.. రెస్క్యూ చేసిన అధికారులు.. వాటి ఖరీదు తెలిస్తే..
Animals Rescue
Follow us on

మహారాష్ట్ర నాసిక్‌లో అరుదైన జంతువులు, పక్షుల అక్రమ రవాణా యద్ధేచ్చగా సాగుతోంది. అధికారుల కళ్లు గిప్పి అక్రమార్కులు మూగజీవాలతో చీకటి వ్యాపారం సాగిస్తున్నారు. తాజాగా నాసిక్‌లో వన్యజాతికి చెందిన కొన్ని అరుదైన పక్షులు, జంతువులను రెస్క్యూ చేశారు అధికారులు. అక్రమంగా రవాణా చేసి సొమ్ము చేసుకోవడానికి ప్రయత్నించిన కొందరు స్మగ్లర్ల ఆటకట్టించారు అటవీశాఖ అధికారులు. అటవీ శాఖ అధికారులతో కలిసి జంతు సంక్షేమ సంఘాలు స్మగ్లర్లను అడ్డుకున్నారు.

పక్కా సమాచారం మేరకు అధికారులు స్మగ్లర్లను అడ్డుకున్నారు. పక్షులు, జంతువులను అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని అడ్డగించిన అధికారులను చూడగానే నిందితులు వాహనాన్ని అక్కడే వదిలేసి పారిపోయారు. అధికారులు అందులోని పక్షులు, జంతువులను రక్షించారు. గాయపడిన కొన్ని పక్షలకు, జంతువులకు వైద్యం చేశారు. అనంతరం వాటిని వాటి సహజ ఆవాసాల్లో వదిలిపెట్టారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి