నాసా బంపర్ ఆఫర్.. మూన్‌పై టాయిలెట్‌ కట్టేందుకు బెస్ట్ ఐడియా ఇస్తే..

గత కొన్నేళ్లుగా చంద్రుడిపై నాసా పరిశోధనలు చేస్తోన్న విషయం తెలిసిందే కదా. ఇప్పటికే ఇల్లు కట్టేందుకు, అక్కడ పంటలు పండించేందుకు ఎన్నో పరిశోధనలు చేస్తున్నారు శాస్త్రవేత్తలు. ఈ క్రమంలోనే నాసా ఆస్ట్రోనాట్స్‌ను మళ్లీ చంద్రుడిపైకి పంపేందుకు సన్నాహాలు మొదలుపెట్టింది. అయితే వారు ల్యూనార్ సర్ఫేస్‌కు చేరుకున్న తర్వాత బాత్రూంకు...

నాసా బంపర్ ఆఫర్.. మూన్‌పై టాయిలెట్‌ కట్టేందుకు బెస్ట్ ఐడియా ఇస్తే..
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jun 26, 2020 | 4:39 PM

గత కొన్నేళ్లుగా చంద్రుడిపై నాసా పరిశోధనలు చేస్తోన్న విషయం తెలిసిందే కదా. ఇప్పటికే ఇల్లు కట్టేందుకు, అక్కడ పంటలు పండించేందుకు ఎన్నో పరిశోధనలు చేస్తున్నారు శాస్త్రవేత్తలు. ఈ క్రమంలోనే నాసా ఆస్ట్రోనాట్స్‌ను మళ్లీ చంద్రుడిపైకి పంపేందుకు సన్నాహాలు మొదలుపెట్టింది. అయితే వారు ల్యూనార్ సర్ఫేస్‌కు చేరుకున్న తర్వాత బాత్రూంకు వెళ్లేందుకు చోటు కావాలని వెతుకుతున్నారు. ఈ క్రమంలోనే చంద్రుడిపై టాయిలెట్(Toilet) కట్టేందుకు ప్లాన్స్ ఇవ్వాలని ఇంజినీర్లకు నాసా ఆఫర్ చేసింది. ల్యూనార్‌లో రెస్ట్ రూమ్ కోసం ఎవరు బెటర్ ఐడియా ఇస్తారోనని ఎదురు చూస్తోంది నాసా.

దీంతో నాసా.. Hero Xతో కలిపి ల్యానార్ లూ ఛాలెంజ్ కాంపిటేషన్ నిర్వహిస్తోంది. భవిష్యత్తులో ల్యూనార్ తలానికి చేరుకుంటే అక్కడ టాయిలెట్ ఎలా వాడాలని దానిపై పరిశోధనలు జరుపుతున్నారు నిపుణులు. కాగా భూమిపై కంటే ల్యూనార్‌పై వాడే టాయిలెట్స్‌ అడ్వాన్స్‌డ్‌గా ఉండాలని సైంటిస్టులు ప్రయత్నిస్తున్నారు. దీంతో బెటర్ ఐడియా ఇచ్చిన వారికి 35 వేల డాలర్ల ప్రైజ్‌లు ఉంటాయని ప్రకటించింది నాసా.

రెస్ట్ రూమ్ అనేది వర్సటైల్‌గా ఉండటంతో పాటు అది ఆర్బిట్‌లోనే పని చేసేదిగా ఉండాలి. ఆ కక్ష్యలో ఆస్ట్రోనాట్స్‌ కూడా తేలిగ్గా అనిపించే సమయంలో పనిచేయాల్సి ఉంటుంది. భూమిపై ఉండే గురుత్వాకర్షణ శక్తిలో ఆరో వంతు అక్కడి తలంలో ఉంటుంది. కాబట్టి ఆచి తూచి మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది నాసా.

Read More: 

‘గూగుల్ పే’లో కొత్త ఫీచర్.. అప్పులు ఇచ్చేందుకు సిద్ధం..

కోడుమూరు వైసీపీ ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్..

వీడియో వైరల్: బుల్లెట్ నడుపుతూ బోర్లాపడ్డ జెర్సీ హీరోయిన్..

బ్రేకింగ్: మరో సీరియల్ నటుడికి కరోనా.. షూటింగ్ రద్దు