NASA Reports: ముంబైతో సహా భారతదేశంలోని 12 నగరాలు సముద్రంలో మునిగిపోనున్నాయా..?: నాసా సంచలన నివేదిక

NASA Reports: తాజాగా నాసా నివేదిక ఆందోళన కలిగిస్తోంది. రానున్న ఏళ్లలో ముంబైతో పాటు భారత్‌లోని 12 నగరాలు ముద్రంలో మునిగిపోయే అవకాశం ఉందని నివేదిక వెల్లడించడం..

NASA Reports: ముంబైతో సహా భారతదేశంలోని 12 నగరాలు సముద్రంలో మునిగిపోనున్నాయా..?: నాసా సంచలన నివేదిక

Updated on: Aug 10, 2021 | 4:52 PM

NASA Reports: తాజాగా నాసా నివేదిక ఆందోళన కలిగిస్తోంది. రానున్న ఏళ్లలో ముంబైతో  సహా భారత్‌లోని 12 నగరాలు ముద్రంలో మునిగిపోయే అవకాశం ఉందని నివేదిక వెల్లడించడం ఆందోళన కలిగిస్తోంది. కాగా, తాజాగా అమెరికా అంతరిక్ష సంస్థ నాసా సముద్రపుమట్టం ప్రొజెక్షన్‌ టూల్‌ను అభివృద్ధి చేసింది. దీని నాసా నివేదిక ప్రకారం.. దీని ఆధారంగా గుజరాత్‌లోని భావనగర్‌, ఓఖా, కాండ్లతో సహా భారతదేశంలోని 12 నగరాలు సముద్ర మట్టాలు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నివేదిక ఆధారంగా భూమి యొక్క ఉష్ణోగ్రత ఇంటర్‌గవర్నమెంట్‌ మెంటల్‌ ప్యానెల్‌ ఆన్‌ క్లైమేట్ చేంజ్ (IPCC) ఇటీవల విడుదల చేసింది. సుమారు 80 సంవత్సరాల తర్వాత అంటే.. 2100 సంవత్సరం నాటికి ప్రపంచం తీవ్ర వేడిని గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. అయితే కార్బన్‌ ఉద్గారాలు, కాలుష్యాన్ని ఆపకపోతే ఉష్ణోగ్రతలు సగటున 4.4 డిగ్రీల సెల్సియస్‌ పెరుగుతాయి. రాబోయే రెండు దశాబ్దాలలో ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీల సెల్సియస్‌వరకు పెరగనున్నట్లు నాసా వెల్లడించింది.

నాసా సీ లెవల్‌ ప్రొజెక్షన్‌ టూల్‌:

నాసాకు చెందిన ప్రొజెక్షన్‌ టూల్‌లో ప్రపంచ పటాన్ని సృష్టించారు. ఇది ప్రపంచంలో ఏ భాగంలో ఏ సంవత్సరంలో ఎంత సముద్ర మట్టం పెరుగుతుంది.. రాబోయే కొన్ని దశాబ్దాలలో ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న నీటి మట్టాలను కొలవడానికి నాసా కొత్త సాధనాన్ని సృష్టించడం ఇదే మొదటిసారి. ఈ సముద్ర మట్టం ప్రొజెక్షన్‌ సాధనం ప్రపంచంలోని అన్ని తీర దేశాలలో సముద్ర మట్టాన్ని కొలవగలదు. 2100 సంవత్సరం నాటికి గుజరాత్‌లోని 3 నగరాలతో సహా దేశంలోని 12 నగరాల్లో నీటి మట్టాలు పెరిగే ప్రమాదం ఉన్నందున భారతదేశంలోని 12 నగరాలు అర అడుగు నుంచి మూడున్నర అడుగుల వరకు సముద్రాలు నీటిలో మునిగిపోనున్నాయని నాసా వెల్లడించింది. ఎందుకంటే వేడి ఎక్కువగా ఉన్నందున సముద్రం మట్టం కూడా పెరుగుతుంది.

అత్యధికంగా ప్రమాదంలో ఉన్న నగరాలు:

1) భావనగర్: 2100 సంవత్సరం నాటికి సముద్ర మట్టం 2.69 అడుగులకు పెరుగుతుంది.

2) కొచ్చి: ఇక్కడ సముద్ర మట్టం 2.36 అంగుళాల వరకు పెరుగుతుంది.

3) మోర్ముగావ్: ఇక్కడ సముద్ర మట్టం గత సంవత్సరం 1.96 అంగుళాల నుండి 2.06 అడుగులకు పెరుగుతుంది.

4) ఓఖాలోని సముద్రపు నీరు 1.96 అడుగులు పెరుగుతుంది.

5) తూర్పుగోదావరి జిల్లాలో సముద్రపు నీరు 1.93 అడుగులు పెరుగుతుంది.

6) పారాదీప్‌లో సముద్ర మట్టం 1.93 అడుగులు పెరుగుతుంది.

7) ముంబైలో సముద్ర మట్టం 1.90 అడుగులు పెరుగుతుంది.

8) కండ్లలో సముద్ర మట్టం 1.87 అడుగులు పెరుగుతుంది.

9) మంగళూరులో సముద్ర మట్టం 1.87 అడుగులు పెరుగుతుంది.

10) చెన్నైలో సముద్ర మట్టం 1.87 అడుగులు పెరుగుతుంది.

11) విశాఖపట్నంలో సముద్ర మట్టం 1.77 అడుగులు పెరుగుతుంది.

12) కిడ్రోపోర్: 2100 నాటికి అర అడుగుల నీరు పెరుగుతుంది.

2100 సంవత్సరం నాటికి ఈ 12 నగరాల్లో సముద్ర మట్టం పెరగడం చాలా ఆందోళన కలిగిస్తోంది. ఈ తీర ప్రాంతాలు, నగరాలన్నింటికీ చాలా చోట్ల ప్రధాన పోర్టులు, వ్యాపార కేంద్రాలు ఉన్నాయి. చేపలు పట్టడం, చమురు వర్తకాలకు, సముద్ర మట్టాలు పెరగడం వల్ల భౌగోళిక నష్టం మాత్రమే కాదు, భారీ ఆర్థిక నష్టాలు కూడా కలుగుతాయి. వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పుల ప్రభావంతో సముద్ర నీటిమట్టం పెరిగితే రానున్న కాలంలో తుఫానుల జోరు మరింత ఉధృతంగా ఉంటుందని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు.

 

ఇవీ కూడా చదవండి

Psyche Asteroid: అంతరిక్షంలో రూ.72 కోట్ల కోట్లు ఖరీదు చేసే రాయి.. భూమిమీద తీసుకుని రావడానికి ప్రయత్నాలు

Coca Cola water: ఈ సముద్రంలో కోలా వాటర్ ప్రవహిస్తుంది.. ఇక్కడ స్విమ్మింగ్ చేస్తే ఆరోగ్యమే.. ఆరోగ్యం..