
దేశంలోని ప్రముఖ సంస్థలలైన మై హోమ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, మై హోమ్ కన్‌స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అరుదైన గౌరవాన్ని పొందాయి. ఉద్యోగుల ఆరోగ్యం, భద్రత, మంచి జీవితం, పర్యావరణ పరిరక్షణలో చాలా బాగా పనిచేసినందుకు ఈ సంస్థలకు అంతర్జాతీయ అవార్డులు దక్కాయి. అవే ప్రతిష్టాత్మక బ్రిటిష్ సేఫ్టీ కౌన్సిల్ గౌరవ పురస్కారాలు. నవంబర్ 28న లండన్‌లోని డ్రేపర్స్ హాల్‌లో బ్రిటిష్ సేఫ్టీ కౌన్సిల్ ఈ అవార్డులను అందజేసింది. ఇవి నిరంతరం కష్టపడి మెరుగైన ఫలితాలు చూపిన వారికి మాత్రమే దక్కుతాయి. ఆరోగ్యం, భద్రత, ఉద్యోగుల శ్రేయస్సు పర్యావరణ ముప్పు నిర్వహణలో అత్యుత్తమ ప్రమాణాలను పాటించినందుకు గాను ఈ అంతర్జాతీయ అవార్డులను అందిస్తారు.
ఈ సందర్భంగా మై హోమ్ ఇండస్ట్రీస్ గ్రూప్ వైస్ చైర్మన్ డిబీవీఎస్ రాజు మాట్లాడుతూ.. తమ సంస్థ ఉద్యోగుల సంక్షేమంపై తమ నిబద్ధతను తెలియజేశారు. ‘‘మా సిబ్బంది పిల్లలకు చదువు, ఆరోగ్యకరమైన భోజనం వంటి సదపాయాలు కల్పించడం ద్వారా మంచి భవిష్యత్తు ఉండేలా చూస్తున్నాము అని ఆయన అన్నారు. ఈ అవార్డుల ముఖ్య ఉద్దేశం.. ఎవరూ తమ పని వల్ల ఇబ్బంది పడకూడదనే నినాదాన్ని మై హోమ్ సంస్థలు నిలబెట్టాయి. ఈ గుర్తింపు ద్వారా మన దేశంలోని కంపెనీలు కూడా ఉద్యోగుల సంరక్షణలో ప్రపంచ స్థాయి ప్రమాణాలను పాటిస్తున్నాయని స్పష్టమైంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..