ప్రస్తుతం ఆన్ లైన్ లో రకరకాల ఆహారం ఆర్డర్ పెట్టుకునేవారు ఎక్కువ. అయితే తినే మందు మీకు తెచ్చిన ప్యాకెట్ లో ఏముందో ఒక్కసారి పరిశీలించండి. మీరు ఆర్డర్ పెట్టిన ఆహారంలో మార్పులు ఉండొచ్చు.. తాజాగా ఓ మహిళ ఆన్ లైన్ లో తినడానికి ఆహారాన్ని ఆర్డర్ పెట్టింది. తినడానికి ప్యాకెట్ ఓపెన్ చేసి చూడగా అందులో తెగిన మానవ అవయవం కనిపించింది. ఇది చూసినా.. ఆలోచించినా ఎవరికైనా గూస్‌బంప్‌లు వస్తాయి. అయితే ఈ ఘటన నిజంగా మహారాష్ట్రలోని ముంబైలో జరిగింది. ఓ డాక్టర్ ఆన్‌లైన్ యాప్ ద్వారా తినడానికి 3 ఐస్‌క్రీమ్‌లను ఆర్డర్ చేశారు. డెలివరీ అయిన వెంటనే ఆ డాక్టర్ ఐస్ క్రీం ప్యాకింగ్ ఓపెన్ చేసి దానిని తినబోతుండగా ఐస్‌క్రీమ్‌లో మనిషి వేలు కనిపించడంతో షాక్ తిన్నారు.
ఇది చూసిన ఆ డాక్టర్ గట్టిగా అరుస్తూ స్పృహ కోల్పోయారు. కొంచెం సేపటికి తేరుకున్న ఆ డాక్టర్ మళ్ళీ ఐస్ క్రీం వైపు చూడడం మొదలు పెట్టి. తాను మోసపోయానని భావించారు. మళ్లీ ఐస్‌క్రీమ్‌ని చూసేసరికి అది 2 సెంటీమీటర్ల మనిషి వేలు అని అర్థమైంది.
GO EAST,GO WEST HOME KITCHEN IS THE BEST 🥹🥲
Content warning ⚠️
What appears to be a human finger found in an icecream cone by a customer in Mumbai. It was ordered via a grocery delivery app.FIR FILED !! #FOOD #HealthyChoices pic.twitter.com/Ref8BTgls4
— Vandana Gupta 🇮🇳 (@im_vandy) June 13, 2024
దీంతో ఆ డాక్టర్ వెంటనే తన కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మలాడ్ పోలీసులకు కూడా సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మానవ వేలితో పాటు ఐస్‌క్రీమ్‌ను పరీక్షల నిమిత్తం పంపించారు. డాక్టర్ ఫిర్యాదు మేరకు యమ్మో ఐస్‌క్రీమ్ కంపెనీపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఐస్‌క్రీమ్, మానవ వేలిని ఫోరెన్సిక్ పరీక్షకు పంపినట్లు పోలీసులు తెలిపారు. వేలు పురుషుడిదా లేదా స్త్రీకి చెందినదా అనే దానిపై ఇంకా ఏమీ తెలియలేదు. నివేదిక వచ్చిన తర్వాత అసలు విషయం తేలనుంది.
అయితే ఈ ఘటన ఆ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది. ఆహార పదార్థాల్లో బల్లులు, ఎలుకలు, ఇతర కీటకాలు ఉన్నట్లు ఇప్పటి వరకు వార్తలు వచ్చాయి. అయితే మానవ శరీర భాగాలను కనుగొనడం కలకలం సృష్టించింది. ఇలా ఎలా జరిగింది అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా కూడా మారింది. యమ్మో ఐస్‌క్రీమ్ ఒక ప్రసిద్ధ బ్రాండ్. ఇప్పుడు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది రిపోర్ట్ వచ్చిన తర్వాతే తెలుస్తుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..