Mumbai Auto Driver : హార్ట్ టచింగ్ స్టోరీ.. స్పందించిన నెటిజన్లు.. ముంబై ఆటోడ్రైవర్ తాతకు భారీ విరాళం అందజేత

ముంబై కు చెందిన ఓ ఆటో డ్రైవర్. ఆటోనే ఇల్లుగా చేసుకుని జీవితాన్ని గడుపుతున్న ఆ డ్రైవర్ తాత గురించి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. . గుంజర్‌ రాటి దేస్రాజ్‌ పేరు మీద ఓ ఫేస్ బుక్ యూజర్ ఫండింగ్ స్టార్ట్...

  • Surya Kala
  • Publish Date - 10:29 am, Wed, 24 February 21
Mumbai Auto Driver : హార్ట్ టచింగ్ స్టోరీ.. స్పందించిన నెటిజన్లు.. ముంబై ఆటోడ్రైవర్ తాతకు భారీ విరాళం అందజేత

Mumbai Auto Driver : కష్టాన్ని ఇష్టంగా పడుతూ.. కుటుంబ భాద్యతలను బరువు అనుకోకుండా నెరవేస్తుంటే.. ఖచ్చితంగా మేము సాయం ఉంటాం అని ఎందరో వ్యక్తులు నిరూపించారు. మనవరాలి చదువుకోసం తన కుటుంబానికి ఆశ్రయం ఇచ్చిన ఇల్లును అమ్మేశాడు ముంబై కు చెందిన ఓ ఆటో డ్రైవర్. ఆటోనే ఇల్లుగా చేసుకుని జీవితాన్ని గడుపుతున్న ఆ డ్రైవర్ తాత గురించి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. . గుంజర్‌ రాటి దేస్రాజ్‌ పేరు మీద ఓ ఫేస్ బుక్ యూజర్ ఫండింగ్ స్టార్ట్ చేసింది. ఇటీవలే దేస్రాజ్ కు రూ. 24లక్షలను విరాళంగా అందించారు. క్రౌడ్ ఫండింగ్ చొరవతో దాతలు ముందుకొచ్చారు. తాత చెక్ అందుకున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

తాత నవ్వుతు పడుతున్న కష్టాన్ని చదివిన వారందరూ స్పందిచారు. కన్నీరు ఆగడంలేదు .. కుటుంబం కోసం ఎంత కష్టపడుతున్నావ్‌.. యువతలో ఉన్న ఎందరో సోమరిపోతులకన్నా మీరు వంద రేట్లు నయం. తప్పక మీ మనవరాలు టీచర్‌ అవుతుంది.. మీ పేరు నిలబెడుతుంది అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మరికొందరు నెటిజనులు దేస్రాజ్‌కు ఆర్ధిక సాయం చేయడానికి ముందుకొచ్చారు. గుంజర్‌ రాటి దేస్రాజ్‌ పేరు మీద ఓ ఫేస్ బుక్ యూజర్ ఫండింగ్ స్టార్ట్ చేసారు. వెంటనే చాలా మంది స్పందించారు. తాత అండగా ఉంటామంటూ..భరోసా నిచ్చారు. ఇక ఇది తెలుసుకున్న కాంగ్రెస్‌ నాయకురాలు అర్చనా కూడా స్పందించారు.. తన ట్విట్టర్‌లో దేస్రాజ్‌ ఆటో నంబర్‌, మొబైల్‌ నంబర్‌, అతడు పని చేసే ప్రాంతం వివరాలు షేర్‌ చేశారు. ఆయనకు సాయం అందించడానికి అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే..

ముంబై కు చెందిన దేస్రాజ్‌ ఆటో నడుపుతూ తన ఇద్దరు కుమారులను పెంచి పోషించి పెద్ద చేశాడు.. అనంతరం పెళ్లిళ్లు కూడా చేశాడు.. అయితే ఆరేళ్ళ పని కోసం వెళ్లిన పెద్ద కొడుకు ఓ వారం తర్వాత శవమై కనిపించాడు.. చేతికంది వచ్చిన కొడుకు తన కళ్ళముందే మరణిస్తే ఆ బాధను దిగమింగి మళ్ళీ కుటుంబ పోషణ కోసం ఆటో నడపడం మొదలు పెట్టాడు. ఈ బాధనుంచి కోలుకోక ముందే దెస్రాజ్ కు మళ్ళీ దెబ్బ తగిలింది.. ఈ సారి రెండో కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు. రెండేళ్ల వ్యవధిలోనే ఇద్దరు కొడుకులను పోగొట్టుకున్న ఆ తండ్రి బాధ వర్ణించడానికి కూడా మాటలు చాలవు. అయితే దేస్రాజ్ తన కొడుకు అర్ధాంతరంగా వదిలేసిన బాధ్యతలను తాను మోయాలనుకున్నాడు.. కుమారుల మరణంతో ఒంటరి వాళ్లైన తన కోడళ్లు, నలుగురు మనవలు, మనవరాళ్ల బాధ్యత భుజానకెత్తుకున్నాడు.

Mumbai Auto Driver Desraj: కొడుకులు పోయారు.. మనవరాలి కోసం వృద్ధుడు తాపత్రయం… ఆటోలోనే అన్నీ.. భేష్ తాతా!