భారీ ఉగ్రదాడికి కుట్ర.. మూడు రాష్ట్రాల్లో హైఅలర్ట్

| Edited By:

Nov 11, 2019 | 2:11 PM

భారత్‌లో అతి పెద్ద ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు వెల్లడించాయి. పాకిస్తాన్‌‌ కేంద్రంగా నడుస్తోన్న జైషే మహ్మద్.. మూడు రాష్ట్రాల్లో దాడులు చేసేందుకు సిద్ధంగా ఉందని నిఘా వర్గాలు కేంద్ర ప్రభుత్వానికి తెలిపాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం.. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది. అయితే మరికొన్ని రోజుల్లో అయోధ్య తీర్పు వెలువడనుందని వార్తలు ప్రారంభమైనప్పటి నుంచే జైషే మహ్మద్ ఉగ్ర సంస్థ కదలికలు దేశంలో తీవ్రం అయ్యాయి. దీంతో పది రోజులుగా భారత […]

భారీ ఉగ్రదాడికి కుట్ర.. మూడు రాష్ట్రాల్లో హైఅలర్ట్
Follow us on

భారత్‌లో అతి పెద్ద ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు వెల్లడించాయి. పాకిస్తాన్‌‌ కేంద్రంగా నడుస్తోన్న జైషే మహ్మద్.. మూడు రాష్ట్రాల్లో దాడులు చేసేందుకు సిద్ధంగా ఉందని నిఘా వర్గాలు కేంద్ర ప్రభుత్వానికి తెలిపాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం.. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది.

అయితే మరికొన్ని రోజుల్లో అయోధ్య తీర్పు వెలువడనుందని వార్తలు ప్రారంభమైనప్పటి నుంచే జైషే మహ్మద్ ఉగ్ర సంస్థ కదలికలు దేశంలో తీవ్రం అయ్యాయి. దీంతో పది రోజులుగా భారత మిలిటరీ ఏజెన్సీ, రా, ఇంటెలిజెన్స్ బ్యూరో వంటి నిఘా సంస్థలన్నీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ వస్తున్నాయి. మరోవైపు డార్క్‌ వెబ్‌సైట్‌లలో ఉగ్రహెచ్చరికలు పోటెత్తడంతో వీటి గుట్టుమట్లను తేల్చడం భద్రతా దళాలకు కష్టంగా మారింది. కాగా టెర్రరిస్ట్‌లు ప్రధానంగా మూడు రాష్ట్రాలపై నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తర్‌ ప్రదేశ్‌ రాష్ట్రాల్లో దాడులు చేసేందుకు వారు పథకాలు రచించినట్లు సమాచారం. వీటితో పాటు మిగిలిన రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలపై కూడా ఉగ్రవాదులు కుట్రకు పన్నుతున్నారని అధికారులు భావిస్తున్నారు. అయితే అయోధ్య కేసు విషయంలో సుప్రీం కోర్టు చారిత్రాత్మక తీర్పు ఇచ్చిన తరువాత నుంచి దేశమంతా హైఅలర్ట్ నెలకొన్న విషయం తెలిసిందే.