Mukesh Ambani: ముకేశ్ అంబానీ, ఆయన కుటుంబానికి బెదిరింపు ఫోన్ కాల్స్‌.. గూగుల్‌లో సెర్చ్ చేసి మరి..

|

Aug 15, 2022 | 2:39 PM

అంబానీ కుటుంబాన్ని బెదిరిస్తూ రిలయన్స్‌ ఫౌండేషన్‌ నిర్వహిస్తోన్న హర్‌కిసాన్‌దాస్‌ ఆసుపత్రికి గుర్తు తెలియని వ్యక్తి ఫోన్‌ చేశాడు. ఉదయం 10.30 గంటల ప్రాంతంలో మళ్లీ అదే నంబరు నుంచి మూడు, నాలుగు సార్లు

Mukesh Ambani: ముకేశ్ అంబానీ, ఆయన కుటుంబానికి బెదిరింపు ఫోన్ కాల్స్‌.. గూగుల్‌లో సెర్చ్ చేసి మరి..
Mukesh Ambani Family
Follow us on

Mukesh Ambani receive threat calls: రిలయన్స్ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌, ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ, ఆయన కుటుంబానికి మరోసారి బెదిరింపు ఫోన్ కాల్స్ రావడం కలకలం రేపింది. అంబానీ కుటుంబాన్ని బెదిరిస్తూ రిలయన్స్‌ ఫౌండేషన్‌ నిర్వహిస్తోన్న హర్‌కిసాన్‌దాస్‌ ఆసుపత్రికి గుర్తు తెలియని వ్యక్తి ఫోన్‌ చేశాడు. ఉదయం 10.30 గంటల ప్రాంతంలో మళ్లీ అదే నంబరు నుంచి మూడు, నాలుగు సార్లు ఫోన్ కాల్స్‌ వచ్చినట్లు ఆసుపత్రి యాజమాన్యం ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ముంబైలోని డీడీ మార్గ్‌ పోలీసులు వెంటనే దర్యాప్తు చేపట్టారు. ఫోన్‌ నంబరు ఆధారంగా ఓ వ్యక్తిని పోలీసులు ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి మానసిక స్థితి సరిగా లేదని సమాచారం. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు ముంబై పోలీసులు వెల్లడించారు. గూగుల్‌లో సెర్చ్ చేసి మరి.. ఆసుపత్రి ల్యాండ్ లైన్‌కు ఫోన్‌ చేసినట్లు తెలుస్తోంది.

కాగా.. గతేడాది ముకేశ్ అంబానీ నివాసం ఆంటిలియా సమీపంలో పేలుడు పదార్థాలతో ఉన్న ఓ స్కార్పియో కారును నిలిపి ఉంచడం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగిన వారం రోజులకే స్కార్పియో యజమాని మన్‌సుఖ్‌ హీరేన్‌ అనుమానాస్పద రీతిలో మరణించాడు. ఈ కేసులను తొలుత ఇన్‌స్పెక్టర్‌ సచిన్‌ వాజే దర్యాప్తు చేపట్టగా.. ఆ తర్వాత ఆయనే ప్రధాన సూత్రధారిగా తేలడంతో ఎన్‌ఐఏ అధికారులు ఆయన్ను అరెస్టు చేశారు. ఈ ఘటన తర్వాత నుంచి ముకేశ్‌ అంబానీ, ఆయన కుటుంబ సభ్యులకు కేంద్ర ప్రభుత్వమే భద్రత కల్పిస్తూ వస్తోంది. దీనిపై పలు పిటీషన్లు దాఖలు కాగా.. కేంద్ర ప్రభుత్వం కల్పిస్తున్న భద్రతను కొనసాగించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పిఐఎల్‌పై త్రిపుర హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం చేసిన అప్పీల్‌ను చీఫ్ జస్టిస్ ఎన్‌వి రమణ, జస్టిస్ కృష్ణ మురారి, జస్టిస్ హిమ కోహ్లీలతో కూడిన ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..