Crime News: కామ పిశాచిగా మారిన ఉపాధ్యాయుడు.. విద్యార్థినిపై ఏడాదిగా అఘాయిత్యం.. వీడియో తీసి..

ఆ సమయంలో వీడియో, ఫొటోలు చిత్రీకరించిన కామాంధుడు.. బ్లాక్ మెయిల్ చేస్తూ ఆమెపై సంవత్సరం నుంచి అఘాయిత్యానికి పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు.

Crime News: కామ పిశాచిగా మారిన ఉపాధ్యాయుడు.. విద్యార్థినిపై ఏడాదిగా అఘాయిత్యం.. వీడియో తీసి..
Representational Image
Follow us

|

Updated on: Jul 26, 2022 | 5:39 PM

Teacher raped girl: దేశంలో నిర్భయ లాంటి కఠిన చట్టాలున్నప్పటికీ మృగాళ్లు రెచ్చిపోతున్నారు. మహిళలు, చిన్నారులపై దారుణాలకు పాల్పడుతున్నారు. తాజాగా.. మధ్య ప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో దారుణ ఘటన చోటకుచేసుకుంది. బాలిక (14) పై కన్నేసిన ట్యూటర్ ఆమెపై దారుణానికి పాల్పడ్డాడు. ఆ సమయంలో వీడియో, ఫొటోలు చిత్రీకరించిన కామాంధుడు.. బ్లాక్ మెయిల్ చేస్తూ ఆమెపై సంవత్సరం నుంచి అఘాయిత్యానికి పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలు 9వ తరగతి చదువుతోంది. నిందితుడు ఆమెకు ట్యూషన్ క్లాసులు చెప్పేందుకు రోజూ ఇంటికి వచ్చేవాడు. కొన్నిసార్లు ఆమె ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడేవాడు. ఈ సమయంలో వీడియోలు, చిత్రాలను కూడా తీసినట్లు పోలీసులు తెలిపారు.

తాను చెప్పినట్లు వినకపోతే ఫోటోలు, వీడియోలను వైరల్ చేస్తానని నిందితుడు బాలికను బెదిరించేవాడు. ఆమె భయంతో చాలాకాలంపాటు మౌనంగా ఉంది. అయితే.. వీడియోల గురించి బయటకు సమాచారం రావడంతో కుటుంబ సభ్యులు ఆమెను ప్రశ్నించారు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. తనపై వేధింపులకు పాల్పడుతూ వీడియోలు, చిత్రాల తీసినట్లు బాధితురాలు కుటుంబసభ్యులకు వివరించింది.

నిందితుడు కొన్ని సందర్భాల్లో తన ఇంటికి పిలిపించుకుని ఆమెపై దారుణాకి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. చదువుకునే సమయంలో పిల్లల వల్ల ఇబ్బంది కలుగుతుందనే సాకుతో తరచూ గదికి తాళం వేసి, బాధితురాలిని హింసించే వాడని పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

అయితే.. బాధితురాలి వీడియోలు, చిత్రాలను కుటుంబ సభ్యునికి ఒకరికి చూపించాడని.. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఉపాధ్యాయుడు పరారీలో ఉన్నాడని.. అతడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో