Madhya Pradesh: తమ ఫ్యామిలీలో ఆడపిల్ల పుట్టిందని అదనపు పెట్రోల్ ఉచితంగా ఇచ్చిన ఓ వ్యక్తి ఎక్కడంటే..

|

Oct 17, 2021 | 8:33 PM

Madhya Pradesh: కొంతమంది ఆడపిల్ల పుడితే బరువు అనుకుంటే.. మరికొందరు తమ ఇంట్లో లక్ష్మీదేవి పుట్టింది అంటూ సంబరాలు చేసుకుంటారు. ఒక డాక్టర్ అయితే..

Madhya Pradesh: తమ ఫ్యామిలీలో ఆడపిల్ల పుట్టిందని అదనపు పెట్రోల్ ఉచితంగా ఇచ్చిన ఓ వ్యక్తి ఎక్కడంటే..
Mp Man
Follow us on

Madhya Pradesh: కొంతమంది ఆడపిల్ల పుడితే బరువు అనుకుంటే.. మరికొందరు తమ ఇంట్లో లక్ష్మీదేవి పుట్టింది అంటూ సంబరాలు చేసుకుంటారు. ఒక డాక్టర్ అయితే ఏకంగా తన ఆస్పత్రిలో ఆడపిల్ల పుడితే.. ఫీజు కూడా తీసుకోకుండా ఉచితంగా డెయిలీవరీ చేస్తూ.. వార్తల్లో నిలిచారు. ఐటీ తాజాగా ఓ ఫ్యామిలీ లో ఆడపిల్ల పుట్టింది… దీంతో ఆ ఇంట్లో సంబరాలు అంబరాన్ని అంటాయి.. ఆడపిల్ల పుట్టిన ఆనందాన్ని పంచుకుంటూ..   ప్రత్యేకంగా ఏదైనా చేయాలని పెట్రోల్ బ్యాంకు యజమాని నిర్ణయించుకున్నాడు. తన కస్టమర్లకు ఏకంగా పెట్రోల్ ఉచితంగా పోశారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

బేతుల్ నగరంలో రాజేంద్ర సైనాని అనే వ్యక్తికీ పెట్రోల్ బంకు ఉంది.  అక్టోబరు 9వతేదీన  రాజేంద్ర సైనాని మేనకోడలికి ఆడపిల్ల పుట్టింది.. దీంతో రాజేంద్ర కు పట్టరాని సంతోషం కల్గింది. తన మేనకోడలికి ఆడపిల్ల పుట్టిన సంతోషంలో  రాజేంద్ర సైనాని పెట్రోల్ కోసం తన బంకు వద్దకు వచ్చిన వినియోగదారులకు రెండు రోజుల పాటు అదనంగా పెట్రోల్ ని ఉచితంగా పోశారు. ఈ నెల 13వతేదీ నుంచి  15వతేదీ వరకు మూడు రోజుల పాటు కస్టమర్స్ కు అదనంగా పెట్రోల్ ని పోశారు.  అయితే తాను చేసే పనిని మార్కెటింగ్ కోసం చేసినట్లు వినియోగదారులు, ప్రజలు భావించకూడని రాజేంద్ర భావించారు. అందుకు తగిన విధంగా ఆలోచించి ప్రణాళిక వేసి.. అమలు చేశారు. అక్టోబర్ 13,14 , 15 తేదీలలో వచ్చే అష్టమి, నవమి , దసరా రోజులలో అమలు చేశారు.  తన మేనకోడలికి కూతురు సందర్భంగా  5-10 శాతం అదనపు పెట్రోల్  ఉచితంగా తన వినియోగదారులకు అందించచనున్నాని ఒక సైన్ బోర్డ్ కూడా పెట్టాడు

ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు 10 శాతం తన వినియోగదారులకు అదనపు పెట్రోల్ పంపిణీ చేశారు.  రూ. 100 పెట్రోల్ పోయించుకున్న కస్టమర్లకు  5 శాతం అదనపు పెట్రోల్ ని ఇచ్చారు. ఇక రూ. 200 నుంచి రూ. 500  విలువైన పెట్రోల్ కొన్న వినియోగదారులకు 10 శాతం అదనంగా పెట్రోలు పోశారు.  రోజు రోజుకీ దేశంలో పెట్రోల్ ధరలు పెరుగుతున్నా తన ఫ్యామిలీలో ఆడపిల్ల పుట్టిందనే  సంతోషన్ని వ్యక్తం చేయడానికి ఇలా అదనపు ఉచిత పెట్రోల్ ఇచ్చినట్లు రాజేంద్ర చెప్పారు.  ప్రస్తుతం రాజేంద్ర సంతోషం సోషల్ మీడియాలో వైరల్ గా  మారింది

Also Read:  చిరంజీవి కుడి చేతికి సర్జరీ.. గాడ్ ఫాదర్ షూటింగ్‌కి విరామం.. ఆందోళ వద్దంటున్న చిరు..