PM Modi Tribute: ఢిల్లీ చేరుకున్న రావత్ సహా 13 మంది పార్థివదేహాలు.. నివాళులర్పించిన ప్రధాని మోడీ

|

Dec 09, 2021 | 9:29 PM

సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ దంపతులతో సహా మరో 11 మంది సైనిక సిబ్బంది పార్థివ దేహాలకు ప్రధాని నరేంద్ర మోడీ నివాళి.

PM Modi Tribute: ఢిల్లీ చేరుకున్న రావత్ సహా 13 మంది పార్థివదేహాలు.. నివాళులర్పించిన ప్రధాని మోడీ
Pm Modi
Follow us on

PM Modi Tribute: తమిళనాడులో జరిగిన ఘోర హెలికాఫ్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలైన సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ దంపతులతో సహా మరో 11 మంది సైనిక సిబ్బంది పార్థివ దేహాలు దేశ రాజధాని ఢిల్లీ పాలెం ఏయిర్‌పోర్టుకు చేరుకున్నాయి. తమిళనాడు నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీలోని పాలెం ఎయిర్‌బేస్‌కు మృతదేహాలను తీసుకొచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్రమంత్రులు, త్రివిధ దళాధిపతులు, పలువురు ప్రముఖులు నివాళులర్పించారు.

నీలగిరి జిల్లా వెల్లింగ్టన్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌ స్టాఫ్‌ కళాశాల సమీపంలో భారత వాయుసేనకు చెందిన ఎంఐ 17వీ5 హెలికాప్టర్‌ కూప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో బిపిన్ రావత్‌తో సహా 13 మంది ప్రాణాలను కోల్పోయారు. స‌ల్లూరు ఎయిర్ బేస్ నుంచి బిపిన్ రావ‌త్, ఆయ‌న భార్య మ‌ధులిక‌, 11 మంది ఆర్మీ అధికారుల పార్థీవ దేహాల‌ను ఆర్మీ ప్ర‌త్యేక విమానంలో ఢిల్లీలోని పాలెం ఎయిర్ పోర్ట్‌కు త‌ర‌లించారు. ఎయిర్ పోర్ట్‌లో ఆర్మీ అధికారుల పార్ధీవ దేహాల‌కు త్రివిధ ద‌ళాలు నివాళులు ఆర్పించాయి. మొదట ఎయిర్ చీఫ్ మార్ష‌ల్ నివాళులు ఆర్పించారు. ఆ త‌రువాత ఆర్మీ అధికారులు, నేవీ అధికారులు నివాళులు అర్పించారు. అనంత‌రం పాలెం ఎయిర్ పోర్టుకు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీతో సహా అజిత్ దోవల్‌, ర‌క్ష‌ణ‌శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నివాళులు ఆర్పించారు.