ఈ సారి సకాలంలోనే వర్షాలు ! జూన్ 1 న కేరళను తాకనున్న రుతుపవనాలు , వ్యవసాయ రంగానికి ఊపు ?

| Edited By: Phani CH

May 06, 2021 | 4:24 PM

దేశంలో ఈ సారి సకాలంలోనే రుతుపవనాలు ప్రవేశించే సూచనలు కనిపిస్తున్నాయి. సాధారణంగా జూన్ 6 లేదా 7 న కేరళను తాకే రుతుపవనాలు ఈ ఏడాది జూన్ 1 నే తాకుతాయని భారత వాతావరణ శాఖ తెలిపింది.

ఈ సారి సకాలంలోనే వర్షాలు ! జూన్ 1 న కేరళను తాకనున్న రుతుపవనాలు , వ్యవసాయ రంగానికి ఊపు ?
Monsoon To Hit Kerala On June 1
Follow us on

దేశంలో ఈ సారి సకాలంలోనే రుతుపవనాలు ప్రవేశించే సూచనలు కనిపిస్తున్నాయి. సాధారణంగా జూన్ 6 లేదా 7 న కేరళను తాకే రుతుపవనాలు ఈ ఏడాది జూన్ 1 నే తాకుతాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. మొత్తం మీద ఈ సంవత్సరం సాధారణ వర్షపాతం నమోదవుతుందని ఈ శాఖ పేర్కొంది. వరుసగా రెండేళ్ల పాటు ఇండియాలో సగటు కన్నా ఎక్కువగా వర్షపాతం నమోదైంది. ఈ ఏడాది ముఖ్యంగా ఈ వర్షపాతం వల్ల వ్యవసాయరంగానికి, తద్వారా ఎకానమీకిఈ రుతుపవనాలు ఎంతో దోహదం చేస్తాయని భావిస్తున్నట్టు ఈ శాఖ అధికారులు తెలిపారు. గత ఏప్రిల్ 16 నే తాము ఈ అంచనాకు వచ్చామని, 40 శాతం నార్మల్ గా, 39 శాతం కొంతవరకు తక్కువగా వర్షపాతం నమోదవుతుందని వారు పేర్కొన్నారు. లాంగ్ పీరియడ్ ఏవరేజ్ ని బట్టి చూస్తే ఇది 98 శాతం ఉండే అవకాశాలు కూడా ఉన్నాయన్నారు. దేశం మొత్తం మీద 880 మి.మీ.వర్షపాతం పడవచ్చు అని కూడా వాతావరణ శాఖ పేర్కొంది. రెండు సంవత్సరాలుగా దేశంలో అధిక వర్షపాతం నమోదయింది. ఇది సుమారు 110 శాతం ఉంది.. కానీ ఈ సారి ఎల్-నినో సదర్న్ ఆసిలేషన్ ప్రభావం ఉండబోదు అని కూడా అధికారులు వివరించారు.
అటు- ఈ శాఖ ‘మాన్ సూన్ కోర్ జోన్ ఆఫ్ ఇండియా’ పేరిట ప్రత్యేక ముందస్తు ప్లాన్ ని రూపొందించింది. దేశంలో పశ్చిమ, తూర్పు, మధ్యస్థ రాష్ట్రాల్లో రుతుపవనాల ప్రభావాన్ని మదింపు చేసేందుకు ఈ ప్లాన్ దోహదపడుతుంది. అయితే అకాల వర్షాల ముప్పు కూడా పొంచి ఉందని, వేసవిలో ఇలా అకాల వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఏమైనా మొత్తం మీద దేశంలో వర్షపాతం ఈ సారి సంతృప్తికరంగా ఉండగలదని అంచనా వేసింది.

 

మరిన్ని ఇక్కడ చూడండి: దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ తప్పదా..? ఇప్పటికే రాష్ట్రాలకు మార్గదర్శకాలు..! కేంద్ర ఆరోగ్య శాఖ ఏం చెబుతుందంటే..

Attacked on Muralidharan: బెంగాల్‌లో యథేచ్చగా హింస.. కేంద్ర మంత్రి మురళీధరన్‌ వాహనంపై దాడి.. కారు ధ్వంసం, పలువురికి గాయాలు