ఆమె కోసం మోదీ సర్కార్ ముందడుగు.. చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్‌ కీలక నిర్ణయం..!

ఆమె కోసం మరో ముందడుగు.. 2029 ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ అమలు చేసే దిశగా మోదీ సర్కార్‌ ప్రణాళికలకు పదనుపెడుతోంది. లోక్‌సభ స్థానాలు 543 కాదు ఇక ఈ సంఖ్య 816కు చేరబోతుంది. అందులో 273 స్థానాలు ఓన్లీ ఫర్‌ వుమెన్‌. ఈ అంశంలో కేంద్రం ఓ నిర్ణయానికి వచ్చింది.

ఆమె కోసం మోదీ సర్కార్ ముందడుగు.. చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్‌ కీలక నిర్ణయం..!
Women Reservation Act

Updated on: Mar 24, 2026 | 7:37 AM

ఆమె కోసం మరో ముందడుగు.. 2029 ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ అమలు చేసే దిశగా మోదీ సర్కార్‌ ప్రణాళికలకు పదనుపెడుతోంది. లోక్‌సభ స్థానాలు 543 కాదు ఇక ఈ సంఖ్య 816కు చేరబోతుంది. అందులో 273 స్థానాలు ఓన్లీ ఫర్‌ వుమెన్‌. ఈ అంశంలో కేంద్రం ఓ నిర్ణయానికి వచ్చింది. త్వరలోనే కేబినెట్‌ భేటీలో ఆమోదం.. ఆపై పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశ పెట్టడమే ఇక తరువాయి.

29 సెప్టెంబర్‌ 2023.. లోక్‌సభ, అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం కేటాయించేందుకు నారీ శక్తి వందన్‌ అధినియమ్‌.. చారిత్రక బిల్లు ఆమోదం పొందిన రోజు. అంతేకాదు పార్లమెంట్‌ కొత్త భవనంలో ఆమోదం పొందిన తొలి బిల్లు కూడా ఇదే. దాదాపు రెండున్నర దశాబ్దాల తరువాత ఎట్టకేలకు బిల్లొచ్చింది సరే..మరి అమలు ఎప్పుడు? అది జరగాలంటే జనగణనతో పాటు నియోజకవర్గాల పునర్విభజన జరగాలి.ఈ రెండూ పట్టాలెక్కడానికి 2027 టార్గెట్‌గా టైంఫ్రేమ్‌ ఫిక్సయింది.కానీ అంతకన్నా ముందే 2011 జనాభా లెక్కల ఆధారంగా మహిళా రిజర్వేషన్లను అమల్లోకి తేవాలని కేంద్రం భావిస్తోంది .అదే జరిగితే ఇక లోక్‌సభలో ప్రస్తుతం వున్న 543 స్థానాల సంఖ్య 816కు చేరుతుంది. అందులో 273 స్థానాలు మహిళలకు మాత్రమే. మరి కొత్త స్థానాలను ఎలా నిర్ణయిస్తారు? వాటిలో మహిళా రిజర్వ్డ్‌ స్థానాలుగా వేటిని ప్రకటిస్తారు? 2011 జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పరిధి నిర్ణయించే అవకాశం వుంది. ఏయే స్థానాలను మహిళాలకు కేటాయించాలన్నది లాటరీ పద్దతిలో జరిపే ఛాన్స్‌ వుంది. అలా చేయడం ద్వారా ఎలక్షన్‌ ఎలక్షన్‌కు రిజర్వేషన్‌ మారుతుంది.

2011 జనాభా లెక్కల ఆధారంగా 2029 ఎన్నికల్లోనే మహిళా రిజర్వేషన్లను అమలు చేయలని మోదీ సర్కార్‌ గట్టి పట్టుదలతో ఉందని స్పష్టమవుతోంది. కానీ నియోజకవర్గాల పునర్విభజన అంశం ఓ కొలిక్కి రాకుండా మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలంటే మరో రాజ్యాంగ సవరణ అవసరం. ఈ బడ్జెట్‌ సమావేశాల్లోనే సభలో సవరణ బిల్లు ప్రవేశపెట్టే దిశగా మోదీ సర్కార్‌ చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది. అఖిల పక్షాల మద్దతు కోసం కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అల్రెడీ రంగంలోకి దిగారనేది టాక్‌. రేపోమాపో కేబినెట్‌ ఆమోదం తరువాత ముందుగా రాజ్యసభలో బిల్లు ప్రవేశ పెట్టాలని భావిస్తునట్టు తెలుస్తోంది.

నారీశక్తి వందన్ అదినియమ్ బిల్లు 128 వ రాజ్యాంగ సవరణతో ఆమోదం పొందింది. లోక్‌సభలో మొత్తం సభ్యుల్లో మూడింట రెండు వంతుల మంది మద్దతు పలికారు. ఇక రాజ్యసభలో భారీ మద్దతు లభించింది. ఇప్పుడు జనగణన,నియోకవర్గాల పునర్విభిజన లేకుండా మహిళ రిజర్వేషన్‌ బిల్లు అమల్లోకి రావాలంటే ఆ చట్టంలోని సెక్షన్ 5ను సవరించాల్సి ఉంటుంది. ఆర్టికల్ 368(2) ప్రకారం ఉభయ సభలలో మూడింట రెండు వంతుల ఆమోదం కంపల్సరీ. ప్రస్తుతం బీజేపీ బలం బలగం లోక్‌సభలో 240 మంది ఎంపీలు, రాజ్యసభలో 103 మంది ఎంపీలు ఉన్నారు. సవరణ బిల్లు సక్సెస్‌ఫుల్‌గా పాస్‌ కావాలంటే విపక్షాల మద్దతు అవసరం.సో..ఏకాభిప్రాయ సాధనపై కేంద్రం దృష్టి సారించింది.అందులో భాగంగా త్వరలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us