LoudSpeakers: లౌడ్‌స్పీకర్లు తొలిగించాల్సిందే.. తమ ఉద్యమం ఆగదంటున్న ఎంఎన్‌ఎస్‌ చీఫ్‌ రాజ్‌థాక్రే..

|

May 04, 2022 | 9:14 PM

మహారాష్ట్ర రాజకీయాలు మరింత రంజుగా మారాయి. లౌడ్‌ స్పీకర్ల వివాదం ఉద్దవ్‌ థాక్రే -రాజ్‌ థాక్రే సోదరులు మధ్య చిచ్చు రేపింది. లౌడ్‌స్పీకర్లను తీసేయాలని గతంలో బాల్‌ థాక్రే చెప్పిన వీడియోను రాజ్‌ థాక్రే విడుదల చేశారు.

LoudSpeakers: లౌడ్‌స్పీకర్లు తొలిగించాల్సిందే.. తమ ఉద్యమం ఆగదంటున్న ఎంఎన్‌ఎస్‌ చీఫ్‌ రాజ్‌థాక్రే..
Uddhav Thackeray Vs Raj Tha
Follow us on

మహారాష్ట్ర రాజకీయాలు మరింత రంజుగా మారాయి. లౌడ్‌ స్పీకర్ల వివాదం (LoudSpeakers Row) ఉద్దవ్‌ థాక్రే -రాజ్‌ థాక్రే(Raj Thackeray) సోదరులు మధ్య చిచ్చు రేపింది. లౌడ్‌స్పీకర్లను తీసేయాలని గతంలో బాల్‌ థాక్రే చెప్పిన వీడియోను రాజ్‌ థాక్రే విడుదల చేశారు. రాజ్‌ థాక్రే ద్రోహి అంటూ గతంలో బాల్‌థాక్రే అన్న వీడియోను విడుదల చేసి కౌంటరిచ్చింది శివసేన. మహారాష్ట్రలో బాల్‌థాక్రే వారసత్వంపై శివసేన – ఎంఎన్‌ఎస్‌ పార్టీల మధ్య పోరు మరింత ముదిరింది. మసీదులపై లౌడ్‌ స్పీకర్ల వివాదం రెండు పార్టీల మధ్య చిచ్చు రేపింది. మసీదుల నుంచి లౌడ్‌స్పీకర్లు తొలగించేదాకా నిరసన కొనసాగుతుందని- MNS చీఫ్‌ రాజ్‌ ఠాక్రే ప్రకటించారు. మసీదులు సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘిస్తున్నా, పోలీసులు మాత్రం తమ పార్టీ కార్యకర్తలనే టార్గెట్‌ చేస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. అజా వినిపించినచోట అంతకు రెట్టింపు శబ్ధంతో హనుమాన్‌ చాలీసా వినిపిస్తామన్నారు. మరోవైపు లౌడ్‌స్పీకర్లు దించాల్సిందే అంటూ గతంలో బాలాసాహెబ్‌ ఠాక్రే చేసిన ప్రసంగపు వీడియోను రాజ్‌ఠాక్రే పోస్ట్‌ చేశారు.

MNS కార్యకర్తలు చెప్పినట్లే చేశారు. పుణెలో లౌడ్‌స్పీకర్లు తొలగించని మసీదు ముందు ఉన్న పుణేశ్వర్‌ హనుమాన్‌ మందిర్‌ నుంచి మహా హారతి నిర్వహించారు. ఆజా శబ్ధంకన్నా రెట్టింపు శబ్ధంతో మహా హారతిని వినిపించారు. ఇప్పటికే మహారాష్ట్రలోని పలుచోట్ల మసీదుల నుంచి లౌడ్‌స్పీకర్లు తొలగించారు. అజా వినిపించే మసీదుల దగ్గర హనుమాన్‌ చాలీసా వినిపించిన MNSకి చెందిన 150 మంది కార్యకర్తలను రాష్ట్రవ్యాప్తంగా అరెస్ట్‌ చేశారు.

అయితే రాజ్‌థాక్రేపై అదేస్థాయిలో ఎదురుదాడికి దిగారు శివసేన నేతలు. మహరాష్ట్రలో శాంతిభద్రతలకు భంగం కలిగించడానికి రాజ్‌థాక్రేను బీజేపీ పావుగా వాడుకుంటోందని శివసేన నేత సంజయ్‌ రౌత్‌ విమర్శించారు. రాజ్‌ థాక్రేను విమర్శిస్తూ గతంలో బాల్‌ థాక్రే మాట్లాడిని వీడియోను విడుదల చేశారు. లౌడ్‌ స్పీకర్లపై బాల్‌థాక్రే వీడియోకు శివసేన నేతలు కౌంటరిచ్చారు.

ఇవి కూడా చదవండి

తాను హింసను ప్రేరేపించడం లేదన్నారు రాజ్‌థాక్రే. లౌడ్‌ స్పీకర్లపై సుప్రీంకోర్టు ఆదేశాలను మాత్రమే అమలు చేయాలని కోరుతున్నట్టు చెప్పారు. లౌడ్‌ స్పీకర్లు మసీదుల మీదనే కాదు ఆలయాల మీద పెట్టినా తీసేయాలని తాను సూచించనట్టు చెప్పారు రాజ్‌థాక్రే.