కేరళ సచివాలయంలో అగ్నిప్రమాదం.. బూడిదైన కీలక పత్రాలు

| Edited By:

Aug 26, 2020 | 8:21 AM

కేరళ సచివాలయంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సెక్రటేరియట్ రెండో అంతస్తులోని జనరల్ అడ్మినిస్ట్రేషన్ పొలిటికల్ సెక్షన్ నుంచి పొగలు వచ్చాయి

కేరళ సచివాలయంలో అగ్నిప్రమాదం.. బూడిదైన కీలక పత్రాలు
Follow us on

Kerala Fire Accident: కేరళ సచివాలయంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సెక్రటేరియట్ రెండో అంతస్తులోని జనరల్ అడ్మినిస్ట్రేషన్ పొలిటికల్ సెక్షన్ నుంచి పొగలు వచ్చాయి. వెంటనే అప్రమత్తమైన అధికారులు మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ క్రమంలో కొన్ని కీలక పత్రాలు కాలి బూడిదైనట్లు అధికారులు తెలిపారు. అయితే అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.

కాగా ఈ ఘటనపై విపక్షాలు మండిపడుతున్నాయి. రాష్ట్రంలో ఇటీవల సంచలనం సృష్టించిన గోల్డ్‌ స్కాంతో సంబంధాలున్న పత్రాలను నాశనం చేసేందుకు ప్రభుత్వమే ఈ నాటకం ఆడిందని వారు విమర్శలు కురిపిస్తున్నారు. ఈ ప్రమాదంపై లోతుగా దర్యాప్తు చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కాగా బంగారు చోరీ కేసు అంశం ప్రస్తుతం సీఎం పినరయి విజయన్ కార్యాలయ పరిశీలనలో ఉన్న విషయం తెలిసిందే.

Read More:

జేఈఈ-నీట్ పరీక్షలు: మార్గదర్శకాలు విడుదల

ఎంపీ కేకేను బురిడీ కొట్టించే ప్రయత్నం.. వ్యక్తిపై కేసు నమోదు