దొంగతనం చేశాడనే అనుమానంతో స్తంభానికి కట్టేసి బాలుడిపై చిత్రహింసలు

టీ దుకాణంలో నగదు దొంగతనం చేశాడని ఆరోపణలు చేస్తూ ఓ మైనర్‌ బాలుడ్ని చిత్ర హింసలకు గురి చేసిన ఘటన చోటుచేసుకుంది. అంతేకాదు అతడి దుస్తులు విప్పేసి నగ్నంగా ఆ బాలుడ్ని స్తంభానికి కట్టేశారు. అంతతో ఆగకుండా కర్రలు, చెప్పులతో ఇష్టం వచ్చినట్లుగా కొట్టారు. ఇక్కడ మరో విషయం ఏంటంటే ఇంతటి దారుణం జరుగుతున్నా కూడా చుట్టుపక్కల వాళ్లేవరు అడ్డుకోలేదు.

దొంగతనం చేశాడనే అనుమానంతో స్తంభానికి కట్టేసి బాలుడిపై చిత్రహింసలు
Crime

Updated on: Oct 02, 2023 | 9:37 PM

టీ దుకాణంలో నగదు దొంగతనం చేశాడని ఆరోపణలు చేస్తూ ఓ మైనర్‌ బాలుడ్ని చిత్ర హింసలకు గురి చేసిన ఘటన చోటుచేసుకుంది. అంతేకాదు అతడి దుస్తులు విప్పేసి నగ్నంగా ఆ బాలుడ్ని స్తంభానికి కట్టేశారు. అంతతో ఆగకుండా కర్రలు, చెప్పులతో ఇష్టం వచ్చినట్లుగా కొట్టారు. ఇక్కడ మరో విషయం ఏంటంటే ఇంతటి దారుణం జరుగుతున్నా కూడా చుట్టుపక్కల వాళ్లేవరు అడ్డుకోలేదు. కానీ ఆ వికృత దృశ్యాలను మాత్రం తమ సెల్‌ఫోన్లలో బంధిస్తూ మౌనంగా అలా నిలబడి ఉండిపోయారు. అయితే నొప్పిని భరించలేక ఆ 12 సంవత్సరా బాలుడు విలవిల్లాడిపోయాడు. అయినా కూడా ఒక్కరు ఆ బాలుడ్ని పట్టించుకోలేదు. అయితే ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లోని సోమవారం ఉదయం చోటుచేసుకుంది. అయితే ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లి ఆ బాలుడ్ని కాపాడారు. వైద్య చికిత్స చేసిన అనంతరం అతని కుటుంబ సభ్యులకు అప్పగించారు.

అయితే ఈ దారుణానికి సంబంధించినటువంటి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. అయితే వీడియో జిల్లా ఎస్పీ సర్వేశ్‌ కుమార్‌ మిశ్రా దృష్టికి వెళ్లింది తీవ్రంగా స్పందించారు. నిందితులపై కఠినంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు చేశారు. అలాగే ఇటువంటి ఘటనలు మళ్లీ జరిగినట్లైతే ఉపేక్షించేది లేదంటూ ఎస్పీ సర్వేశ్‌ కుమార్‌ మిశ్రా హెచ్చరికలు చేశారు. అలాగే ఈ కేసుకు సంబంధించి ముగ్గురు నిందితులను పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ నిందితుల్లో తండ్రి, కొడుకు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం దీనిపై మరింతగా విచారణ చేస్తున్నామని జిల్లా ఎస్పీ వివరించారు. దర్యాప్తు జరిగిన అనంతరం అన్ని విషయాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు. మళ్లీ ఇలాంటి ఘటనలు ఎక్కడైన పునరావృతమైతే కఠినంగా శిక్షిస్తామంటూ హెచ్చరికలు చేశారు సర్వేశ్‌ కుమార్‌ మిశ్రా.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉండగా.. తన కొడుకుకి ఇలా జరిగిన విషయంపై అతని తల్లి స్పందించారు. తన కొడుకుని స్తంభానికి కట్టి కొడుతున్నటువంటి విషయాన్ని తెలుసుకొని వెంటనే అక్కడికి వెళ్లానని బాధితుని తల్లి చెప్పారు. ఎందుకు కొడుతున్నారని తాను అడిగితే.. దీనికి వాళ్లు అతడు డబ్బులు దొంగతనం చేశాడనని అందుకే కొడుతున్నామని అన్నారని తెలిపారు ఆ తల్లి. అయితే ఒకవేళ డబ్బులు దొంగిలిస్తే అతని వద్దే ఉండాలి కదా.. మరి ఎక్కడున్నాయని అడిగితే సమాధానం చెప్పలేదని అన్నారు. అయితే తన కొడుకుని వదిలపెట్టాలని ఎంతగా అడిగినా కూడా పట్టించుకోలేదని.. తన కళ్ల ముందే కొడుకును ఇష్టమొచ్చినట్లుగా కొట్టారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ ఘటన ఫిరోజాబాద్‌లో చర్చనీయాశంమవుతోంది. ఒక బాలుడ్ని ఇంతలా కొట్టడం దారణమని చాలామంది నిందితులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.