Ramagundam Fertilizers: రామగుండం ఫెర్టిలైజర్స్ పునర్నిర్మాణ పనులను సమీక్షించిన కేంద్ర మంత్రి సదానంద గౌడ

|

Jan 21, 2021 | 6:49 PM

Ramagundam Fertilizers: రామగుండం ఫెర్టిలైజర్‌ పునర్నిర్మాణ పనులను ఢిల్లీలో కేంద్ర మంత్రి సదానందగౌడ్‌ గురువారం సమీక్షించారు. గ్యాస్‌ ఆధారిత యూరియా యూనిట్‌..

Ramagundam Fertilizers: రామగుండం ఫెర్టిలైజర్స్ పునర్నిర్మాణ పనులను సమీక్షించిన కేంద్ర మంత్రి సదానంద గౌడ
Follow us on

Ramagundam Fertilizers: రామగుండం ఫెర్టిలైజర్‌ పునర్నిర్మాణ పనులను ఢిల్లీలో కేంద్ర మంత్రి సదానందగౌడ్‌ గురువారం సమీక్షించారు. గ్యాస్‌ ఆధారిత యూరియా యూనిట్‌ ద్వారా 12.7 లక్షల మెట్రిక్‌ టన్నుల నీమ్‌ కోటెడ్‌ యూరియా ఉత్పత్తి సాధించాలనే లక్ష్యంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. తద్వారా దిగుమతుల భారం తగ్గించుకోవడంతో పాటు స్థానికంగా ఉపాధి కల్పించడంపై దృష్టి సారిస్తామన్నారు. అయితే పనుల పురోగతిపై కేంద్ర మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పనులు 99.85 శాతం పూర్తయ్యాయని, అతి త్వరలో జాతికి అంకితం చేస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థల సంయుక్త భాగస్వామ్యంతో రామగుండం ఫెర్టిలైజర్స్‌ కర్మాగారం పనులు కొనసాగుతున్నాయి.

Also Read: Traffic Police Tweet: తండ్రీకొడుకుల వాట్సాప్ చాట్‌ను ట్వీట్ చేసిన ట్రాఫిక్ పోలీసులు.. సోషల్ మీడియాలో వైరల్