ముంబైలో మ్యాన్ హోల్ పై 7 గంటలు నిలబడిన మహిళ ఈమే !

| Edited By: Pardhasaradhi Peri

Aug 10, 2020 | 6:50 PM

భారీ వర్షాలతో సతమతమైన ముంబైలోని ..మాతుంగా ప్రాంతంలో ఓ ఓపెన్ మ్యాన్ హోల్ పై దాదాపు 7 గంటలపాటు నిలబడి వాహనాలను 'నియంత్రించిన' మహిళ ఎవరో..

ముంబైలో మ్యాన్ హోల్ పై 7 గంటలు నిలబడిన మహిళ ఈమే !
Follow us on

భారీ వర్షాలతో సతమతమైన ముంబైలోని ..మాతుంగా ప్రాంతంలో ఓ ఓపెన్ మ్యాన్ హోల్ పై దాదాపు 7 గంటలపాటు నిలబడి వాహనాలను ‘నియంత్రించిన’ మహిళ ఎవరో తెలిసింది. (వర్షపు నీటితో చెరువును తలపిస్తున్న రోడ్డులోని మ్యాన్ హోల్ పై ఈ నెల 4 న నిలబడి వాహనాలు ప్రమాదాల బారిన పడకుండా చూసిన ఈమె తాలూకు వీడియో వైరల్ అయింది). ఈమె పేరు కాంతా మూర్తి కలాన్..వయస్సు 50 ఏళ్ళు.. రోడ్డు పక్కన పూలు అమ్ముకుని జీవించే ఈ పేద మహిళ భర్తకు రైలు యాక్సిడెంట్ కావడంతో పక్షవాతం సోకి మంచం పట్టాడట. తమకు అయిదుగురు పిల్లలని,  వీరిలో ముగ్గురు పిల్లల చదువులకోసం తానే పూలు అమ్మతున్నానని ఆమె చెప్పుకొచ్చింది.

అయితే ఆ రోజున అలా మ్యాన్ హోల్ పై నిలబడినందుకు మున్సిపల్ అధికారులు తనను తీవ్రంగా మందలించారని, నీకేదయినా ప్రాణహాని జరిగితే ఎవరు బాధ్యులని ప్రశ్నించారని కాంతా మూర్తి వెల్లడించింది. కానీ… ‘నాకు తోచింది చేశా.. నేను అలా ఆ మ్యాన్ హోల్ పై నిలబడకపోయి ఉంటే ఏ వాహనమైనా, లేదా ఏ వ్యక్తి అయినా ఆ మ్యాన్ హోల్ కారణంగా ప్రమాదం బారిన పడి  ఉండేవారు కదా’ అని ఆమె అమాయకంగా వ్యాఖ్యానించింది. అయితే ఇంత జరిగినా ఈమె పేద స్థితిని చూసి ఆదుకునేందుకు ఎవరూ ముందుకురాకపోవడం విచారకరం.