Watch Video: మామూలు ఫర్ఫార్మెన్స్ కాదురోయ్.. దండం పెట్టాడు.. క్లాత్ కప్పేశాడు.. కట్ చేస్తే నెక్ట్స్ లెవెల్ సీన్..
Viral Video: దొంగలందరూ ఒకేరకం కాదు.. ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్.. ఎవరి ప్లాన్ ప్రకారం వాళ్లు దోచుకుంటారు. మరికొందరు దొంగలకు ఫ్యాంటసీ ఉంటుంది. దోపిడీలోనూ చిత్ర విచిత్ర ప్రదర్శనలు చేస్తారు. వీరు దోచుకునే స్టైల్ కూడా డిఫరెంట్‌గా ఉంటుంది. కొందరు రాత్రికి రాత్రే సెటిల్ అవ్వాలనే ఉద్దేశ్యంతో బ్యాంకులను చోరీ చేస్తే.. మరికొందరు ఏటీఎంలను కొల్లగొడతారు.
Viral Video: దొంగలందరూ ఒకేరకం కాదు.. ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్.. ఎవరి ప్లాన్ ప్రకారం వాళ్లు దోచుకుంటారు. మరికొందరు దొంగలకు ఫ్యాంటసీ ఉంటుంది. దోపిడీలోనూ చిత్ర విచిత్ర ప్రదర్శనలు చేస్తారు. వీరు దోచుకునే స్టైల్ కూడా డిఫరెంట్‌గా ఉంటుంది. కొందరు రాత్రికి రాత్రే సెటిల్ అవ్వాలనే ఉద్దేశ్యంతో బ్యాంకులను చోరీ చేస్తే.. మరికొందరు ఏటీఎంలను కొల్లగొడతారు. ఇంకొందరు ఇళ్లలో చోరీ చేస్తారు.. చైన్ స్నాచింగ్‌కు పాల్పడుతారు. కానీ, కొందరుంటారు.. వారి టార్గెట్ ఓన్లీ టెంపుల్స్ మాత్రమే. గుడిలోకి వస్తారు.. వచ్చిన పని సైలెంట్‌గా పూర్తి చేసుకుని వెళతారు. తాజాగా ఇలాంటి చోరీకి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. వీడియో చూసి నెటిజన్లు సైతం షాక్ అవుతున్నారు. వీడు చోరీ చేసిన విధానం చూస్తే అవాక్కవ్వాల్సిందే.
దొంగలందు ఈ దొంగ స్టైలే వేరయా.. అయ్యగారి వాలకం చూస్తే అమాయకరత్న మాదిరిగా ఉంటాడు. సైకిల్ మీద సైలెంట్‌గా వస్తాడు. వస్తాడు కాదు.. వచ్చేశాడు. గుడిలో దేవుడి దర్శనం కోస అన్నట్లుగా వచ్చాడు. ఎవరూ లేని సమయంలో గుడిలోకి ఎంటరనై.. ఈ చోర కళా వల్లభుడు.. ముందుగా దేవుళ్లకు దండం పెట్టాడు. తాను చేయబోయే తప్పు గురించి ముందుగానే దేవుడికి ఇంటిమేషన్ ఇస్తూ.. తనను క్షమించాలని కోరుకుంటున్నట్లుగా నమస్కరించాడు. ఆ తరువాత తన జేబుంలోచి ఓ క్లాత్ తీసి, దేవుడి విగ్రహాల పక్కన పెట్టాడు. మళ్లీ దండం పెట్టాడు. ఓ నాలుగు అడుగులు వెనక్కి వేసి.. టెంపుల్ గేట్ వద్దకు వెళ్లాడు. అక్కడ ఎవరైనా వస్తున్నారా? లేదా? అని చెక్ చేసుకున్నాడు. ఎవరూ లేరని నిర్ధారించకున్న కేటుగాడు.. నేరుగా దేవుడి వద్దకు వచ్చి.. పక్కన పరిచిన క్లాత్‌ను దేవుడి విగ్రహాలపై కప్పేశాడు. ఇంకేముంది.. విగ్రహాలతో సహా క్లాత్‌లో మడతపెట్టి చెక్కేశాడు.
ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లాలో చోటు చేసుకుంది. శ్రీకృష్ణుడి ఆలయంలోకి ప్రవేశించిన దొంగత.. తన వెంట తెచ్చుకున్న క్లాత్తో విగ్రహాన్ని కప్పేసి.. ఎత్తుకెళ్లాడు. అయితే, కేటుగాడి చోరీ, వాడి ఫర్ఫార్మెన్స్ అన్నీ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఆ ఫుటేజీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ దొంగ వేశాలు చూసి జనాలు అవాక్కవుతున్నారు. కాగా, ఈ సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
