Independence day: ఆకట్టుకుంటోన్న కొత్త స్వాతంత్ర గీతం.. MDH నుంచి..

|

Aug 14, 2024 | 9:31 PM

జై భారత్‌, జై హింద్‌ అనే లైన్‌తో సాటే ఈ పాట విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇండియా ప్రయాణ సెలబ్రేషన్‌ పేరుతో MDH ఈ పాటను రూపొందించింది. 78వ స్వాతంత్ర్య దినోత్సవ శుభ సందర్భంలో ఈ గీతాన్ని విడుదల చేశారు. ఈ గీతం విశ్వ గురువుగా మారుతోన్న భారతానికి ప్రతిబింబంగా నిలుస్తుందని చెబుతున్నారు...

Independence day: ఆకట్టుకుంటోన్న కొత్త స్వాతంత్ర గీతం.. MDH నుంచి..
Independence Day 2024
Follow us on

స్వాతంత్ర్య దినోత్సవ వేడులకు యావత్ దేశం సిద్ధమవుతోంది. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 78 ఏళ్లు గడుస్తోన్న సందర్భాన్ని పురస్కరించుకొని దేశ వ్యాప్తంగా ఘనంగా వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో ప్రముఖ మ‌సాలా బ్రాండ్ల సంస్థ MDH స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని స్వాతంత్ర్య గీతాన్ని రూపొందించింది. ప్రస్తుతం ఈ పాట సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.

జై భారత్‌, జై హింద్‌ అనే లైన్‌తో సాటే ఈ పాట విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇండియా ప్రయాణ సెలబ్రేషన్‌ పేరుతో MDH ఈ పాటను రూపొందించింది. 78వ స్వాతంత్ర్య దినోత్సవ శుభ సందర్భంలో ఈ గీతాన్ని విడుదల చేశారు. ఈ గీతం విశ్వ గురువుగా మారుతోన్న భారతానికి ప్రతిబింబంగా నిలుస్తుందని చెబుతున్నారు.

ప్రముఖ మసాలా బ్రాండ్‌ MDH గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈ బ్రాండ్‌కు సుమారు 105 ఏళ్ల చరిత్ర ఉంది. 1919లో మహాశయ్‌ చున్నిలాల్‌ గులాటీ బ్రిటిష్‌ ఇండియాలోని సియాల్‌కోట్‌లో ఏర్పాటు చేశారు. ఇది ప్రస్తుతం పాకిస్తాన్‌లో పంజాబ్‌ ప్రావినెన్స్‌లో ఉంది. కాగా ఈ ప్రత్యేక గీతాన్ని విడుదల చేసిన సందర్భంగా పద్మభూషన్‌.. MDH ఛైర్మన్‌ శ్రీ రాజీవ్‌ గులాటీ మాట్లాడుతూ.. ప్రజల అవిశ్రాంత కృషి, దేశం పట్ల విడదీయరాని బంధం భారత్‌ను విజయపథంలో నడిపించేందుకు సహాయపడుతుందని తెలిపారు.

స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని రూపొందించిన ఈ గీతాన్ని ప్రముఖ గాయకుల్లో ఒకరైన షాన్‌ అద్భుతంగా ఆలపించారు. ఈ గీతం మన తరానికి ప్రతి రంగంలోనూ భారత్ గర్వపడేలా చేస్తుందని ఆయన అన్నారు. అలాగే ఈ గీతం భారత సేవలో తమ ప్రాణాలను ఆర్పించి, దేశ స్వాతంత్రాకి కృషి చేసిన వారిని స్మరించుకోవడానికి ఒక మార్గమని, ఇది భవష్యత్తతు తరాలకు మార్గదర్శకాన్ని చేస్తుందని తెలిపారు.

గీతంలోని పదాలు.. దేశంలోని యువశక్తి, నారీ శక్తిని చాటి చెప్పేలా ఉన్నాయి. అలాగే.. దేశాన్ని ఉన్నతంగా, విక్షిత్‌ భారత్‌ కోసం ప్రజలంతా ఏకం కావాలని స్పష్టమైన సందేశాన్ని దేశ ప్రజలకు అందిస్తుంది. అలాగే గీతంలోని పదాలు.. మన సైనికులు, శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపేలా ఉన్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..