తల్లి తోడబుట్టిన సోదరులు మనకు మేనమామలు.. తండ్రి తర్వాత తండ్రి అంతటి స్థానం మేనమామకే ఉంటుంది. అందుకనే తన మేనకోడలికి జరిగే ఏ శుభకార్యంలోనైనా మేన మామ పాత్ర తప్పక ఉండాల్సిందే.. తాజాగా ముగ్గురు మేనమామలు తమ మేనకోడలి పెళ్ళికి ఇచ్చిన గిఫ్ట్ రికార్డ్ సృష్టించింది. మేనకోడలి పెళ్లి కోసం ముగ్గురు మేనమామలు కలిసి కోట్ల విలువజేసే కానుకలు చదివించుకున్నారు. రాజస్థాన్‌లోని నాగౌర్ జిల్లాలో ముగ్గురు రైతు సోదరులు చరిత్ర సృష్టించారు. తన మేనకోడలి పెళ్లికి 3 కోట్ల 21 లక్షల రూపాయల విలువచేసే కట్నకానుకలు చదివించుకున్నారు. వైరల్ గా మారిన ఈ ఘటన ప్రస్తుతం చర్చనీయాంశమైంది. నాగౌర్ జిల్లాలో నివసిస్తున్న ఒక జాట్ కుటుంబం వారి మేనకోడలు వివాహానికి కనివీని ఎరుగని కానుకను సమర్పించుకున్నారు. ఇది చారిత్రకమైన, సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఈ విషయం తెలిసి స్థానికులు సైతం పెద్ద సంఖ్యలో వివాహవేదిక వద్దకు బారులు తీరారు.
రాజస్థాన్‌లోని నాగౌర్ జిల్లాలోని బుర్డీ గ్రామంలో జరిగిన వివాహ వేడుక ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. గ్రామానికి చెందిన ఒక ధనిక వ్యవసాయ కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు హరేంద్ర, రామేశ్వర్, రాజేంద్రలు తమ మేనకోడలిపై ప్రేమను చాటుకున్నారు. వారి గ్రామంలో పాటించే మైరా సంప్రదాయాన్ని అట్టహాసంగా నిర్వహించారు. మైరా సంప్రదాయం ప్రకారం మేనకోడలు లేదా మేనల్లుడి కోసం మేనమామలు బహుమతులు తీసుకెళ్లే ఆచారం ఉంది. ఇందులో భాగంగా వీరు కూడా తమ కోడలికి గతంలో ఎవరూ పెట్టని రీతిలో మైరాను అప్పగించారు. మైరాలో భాగంగా మేనకోడలి పెళ్లికి రూ.3.21 కోట్ల విలువ చేసే నగదు, ఆస్తులను కట్నంగా ఇచ్చారు.
फिर मायरा दहेज से अलग कैसे हुआ ? बस देने का तरीका ही अलग दिख रहा है.#Nagaur pic.twitter.com/gzVhmA9onG
— अवधेश पारीक (@Zinda_Avdhesh) March 16, 2023
ఇందులో 10 ఎకరాల వ్యవసాయ భూమి, రూ.30 లక్షలు విలువ చేసే స్థలం, 41 తులాల బంగారం, 3 కిలోల వెండి, ట్రాక్టర్ నిండా ధాన్యం, స్కూటీ లతో పాటు రూ.80 లక్షల నగదును ముట్టజెప్పారు. దాంతో పాటు గ్రామంలోని ప్రతి ఇంటికి వెండి నాణెం కానుక ఇచ్చారు.
ఇక్కడ చారిత్రాత్మక మైరాను నింపే సంప్రదాయం ఏళ్ల తరబడి కొనసాగుతోంది. ఇంతకు ముందు కూడా ఇలాంటి ఘటనలు చాలానే వెలుగులోకి వచ్చాయి. గతంలో ఒక కుటుంబం మైరాలో భాగంగా 1 కోటి వరకు మేనమామలు సమర్పించారు. అయితే, ఇప్పుడు ఇచ్చిన మైరా పాత రికార్డులను బద్దలు కొట్టింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం..