Fire Accident: చెన్నై ప్రభుత్వాసుపత్రిలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం జరిగింది. బుధవారం 11 గంటల సమయంలో ఐసీయూలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఆసుపత్రిలో ఒక్కసారిగా భారీగా పొగ కమ్ముకుంది. దీంతో రోగులు శ్వాసతీసుకోలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. మూడు అగ్నిమాపక యంత్రాలతో మంటుల ఆర్పుతున్నారు.
మంటలు చెలరేగిన సమయంలో ఆసుపత్రిలో సుమారు 50 మంది రోగులు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్న రోగులను బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. రోగులను మరో ఆసుపత్రికి తరలిస్తున్నారు. అగ్ని ప్రమాదం గురించి తెలిసిన వెంటనే ఆరోగ్య శాఖ మంద్రి సుబ్రమణియన్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం ఎలా జరిగింది అన్న కోణంలో పోలీసులు విచారణ ప్రారంభించారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరైనా మరణించారా.? అన్న విషయాలు తెలియాల్సి ఉంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..
Also Read: Hyderabad: ప్రయాణికులకు అలర్ట్.. హైదరాబాద్ లో నేడు ట్రాఫిక్ ఆంక్షలు.. ప్రత్యామ్నాయ మార్గాలివే
TRS Foundation Day Live: దేశ ప్రజలు ఎందుకు చీకట్లో ఉండాలి.. కేంద్రాన్ని ప్రశ్నించిన సీఎం కేసీఆర్
Watch Video: టోల్ ఫీజు అడిగినందుకు దారుణం.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే.. వైరల్ వీడియో..