U ఆకారంలో అటాక్, 600 మందికి పైగా మావోలు.. 100 మీటర్ల నుంచి కాల్పులు, ఐఈడీలు, రాకెట్‌ లాంచర్లు, ఏకే 47లతో మెరుపు దాడి

|

Apr 04, 2021 | 12:16 PM

Chhattisgarh Maoist attack : ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల మెరుపుదాడిలో సంచలనాల విషయాలు బయటకువస్తున్నాయి. పక్కా ప్రణాళిక ప్రకారమే.. వ్యూహాత్మక ఎత్తుగడ ప్రకారమే మావోయిస్టులు భద్రతా దళాలపై..

U ఆకారంలో అటాక్,  600 మందికి పైగా మావోలు.. 100 మీటర్ల నుంచి కాల్పులు, ఐఈడీలు, రాకెట్‌ లాంచర్లు, ఏకే 47లతో మెరుపు దాడి
Moists Attack In Chattisgha
Follow us on

Chhattisgarh Maoist attack : ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల మెరుపుదాడిలో సంచలనాల విషయాలు బయటకు వస్తున్నాయి. పక్కా ప్రణాళిక ప్రకారమే.. వ్యూహాత్మక ఎత్తుగడతో మావోయిస్టులు భద్రతా దళాలపై మాటు వేసి దాడి చేశారు. కూంబింగ్‌ ఆపరేషన్‌ నిర్వహిస్తున్న భద్రతా బలగాలను ప్లాన్‌ ప్రకారం..  తాము అనుకున్న ప్రదేశానికి రాగానే మావోయిస్టులు యు ఆకారంలో మాటు వేసి దాడికి పాల్పడ్డారు. దాడిలో 600 మందికిపైగా మావోయిస్టులు పాల్గొన్నట్లు సమాచారం. 100 నుంచి 200 మీటర్ల దూరం నుంచి మావోయిస్టులు కాల్పులు జరపడంతో జవాన్లు తప్పించుకోలేకపోయారు. ఒకేసారి ఐఈడీలు, రాకెట్‌ లాంచర్లు, ఏకే 47తో మెరుపు దాడి చేశారు.

మావోయిస్టులు యు ఆకార వ్యూహంతో భద్రతబలగాలు భారీగా నష్టపోయాయి. కడపటి సమాచారం ప్రకారం 14 మంది జవాన్లు చనిపోయారు. ఎదురు కాల్పుల్లో ఐదుగురు జవాన్లు అక్కడిక్కడే మృతిచెందారు. ఇవాళ మరో 9 మంది జవాన్ల మృతదేహాలు గుర్తించారు. ఎన్‌కౌంటర్‌ తర్వాత 24 మంది జవాన్ల ఆచూకీ లేకుండా పోయింది. వీరి ఆచూకీ కోసం గాలింపు జరుగుతోంది.

దండకారణ్యంలో మావోయిస్టుల ఏరివేతకు CRPF, కోబ్రా, DRG లకు చెందిన దాదాపు 2 వేల మంది భద్రతా బలగాలు గాలింపు నిర్వహిస్తున్నాయి. ఐదు ప్రాంతాల నుంచి ఒకేసారి శనివారం ఆపరేషన్‌ చేపట్టారు. ఈ క్రమంలో తరెం ఏరియాలో కూంబింగ్‌ నిర్వహిస్తున్న 400 మంది భద్రతా బలగాలపై మావోయిస్టు మిలటరీ పుటూన్‌ దళాలు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డాయి. వెంటనే భద్రతాబలగాలు ఎదురుకాల్పులకు దిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దర మావోయిస్టులు మృతి చెందారు. ఎదురు కాల్పుల్లో 30 మంది జవాన్లు తీవ్ర గాయాలయ్యాయి. వారిలో 23మందిని జగ్‌దల్‌పూర్‌, మరో ఏడుగురిని రాయ్‌పూర్‌ ఆసుపత్రికి తరలించారు.

ఇదిలా ఉండగా, రెండు వారాలుగా దండకారణ్యం దద్దరిల్లుతోంది. మావోయిస్టులు వర్సెస్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ మధ్య యుద్ధమే జరుగుతోంది. ఛత్తీస్‌గఢ్‌లో గత పదిరోజుల్లో రెండో అతిపెద్ద ఎన్‌కౌంటర్‌ ఇది. మార్చి 23న బస్సును మావోయిస్టులు పేల్చివేశారు. ఈ ఘటనలో ఐదుగురు DRG సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.

Read also : Gun threatening : తుపాకీతో కాల్చేస్తానంటూ ఓ వ్యక్తి హల్‌ చల్‌, శ్రీకాకుళం జిల్లా కొర్లాంలో భయంతో పరుగులు తీసిన జనం