హిమాచల్ వరదల్లో  మంజూ వారియర్

|

Aug 20, 2019 | 5:01 PM

హిమాచల్ ప్రదేశ్ వరదల్లో చిక్కుకుపోయారు మలయాళ సూపర్ స్టార్ మంజూ వారియర్. ఆమె నటిస్తున్న ఓ సినిమా షూటింగ్ కోసం ఛత్రు హిల్ స్టేషన్ కు వెళ్లింది మూవీ టీమ్. ఐతే గత మూడు రోజులుగా హిమాచల్ ప్రదేశ్ లో కుండపోత వానలు పడుతుండటంతో బయటకు రాలేక అక్కడే చిక్కుకుపోయారు మంజూ వారియర్, ఫిల్మ్ మేకర్ సనాల్ కుమార్ శశిధరన్ తో పాటు చిత్ర యూనిట్. తామంతా వరదల్లో చిక్కుకుపోయినట్లు మంజూ వారియర్ అందించిన సమాచారంతో రెస్క్యూటీంను […]

హిమాచల్ వరదల్లో  మంజూ వారియర్
Follow us on

హిమాచల్ ప్రదేశ్ వరదల్లో చిక్కుకుపోయారు మలయాళ సూపర్ స్టార్ మంజూ వారియర్. ఆమె నటిస్తున్న ఓ సినిమా షూటింగ్ కోసం ఛత్రు హిల్ స్టేషన్ కు వెళ్లింది మూవీ టీమ్. ఐతే గత మూడు రోజులుగా హిమాచల్ ప్రదేశ్ లో కుండపోత వానలు పడుతుండటంతో బయటకు రాలేక అక్కడే చిక్కుకుపోయారు మంజూ వారియర్, ఫిల్మ్ మేకర్ సనాల్ కుమార్ శశిధరన్ తో పాటు చిత్ర యూనిట్. తామంతా వరదల్లో చిక్కుకుపోయినట్లు మంజూ వారియర్ అందించిన సమాచారంతో రెస్క్యూటీంను పంపించి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని ప్రకటించారు హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్.

1995లో సినీరంగ ప్రవేశం చేసిన మంజూ వారియర్..నాలుగేళ్లలోనే 20 సినిమాల్లో నటించారు. 2014లో రీ ఎంట్రీ ఇచ్చిన మంజు నటించిన హౌ ఆల్డ్ ఆర్ యూ సూపర్ హిట్ అవడంతో దక్షిణ భారత భాషల్లో ఆమెకు ఆఫర్లు క్యూ కట్టాయి.

ఇక మూడు రోజులుగా హిమాచల్ ప్రదేశ్ లో ఎడతెరిపిలేని వర్షాలు పడుతుండటంతో నదులు ప్రమాద స్థాయిని దాటి ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కొండచరియలు విరిగిపడుతుండటంతో పాటు భారీ వర్షాలు, వరదలకు రోడ్లు కొట్టుకుపోయి పలు ప్రాంతాలకు సంబంధాలు తెగిపోయాయి.  గత మూడు రోజుల్లో 26 మంది మృతి చెందగా..పలువురు గల్లంతయ్యారు. వరదల వల్ల రాష్ట్రంలో 20 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని ప్రకటించారు అధికారులు.  రానున్న కొద్ది రోజుల వరకు భారీ వర్షాలు పడే అవకాశముందని..అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు వాతావరణ శాఖాధికారులు.