
మణిపూర్‌లో అల్లరిమూకలపై భద్రతా బలగాలు ఉక్కుపాదం మోపుతున్నాయి. మణిపూర్ పోలీసులు, అసోం రైఫిల్స్, ఆర్మీ, సీఆర్‌పీఎఫ్ జాయింట్ ఆపరేషన్‌లో భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఐదు జిల్లాల్లో సోదాలు చేసిన భద్రతా బలగాలు 328 అధునాతన ఆయుధాలను సీజ్ చేశాయి. 151 SLR రైఫిళ్లు, 65 ఇన్సాస్ రైఫిళ్లు స్వాధీనం చేసుకున్నారు. 9,300 రౌండ్ల బుల్లెట్లతోపాటు.. భారీగా పేలుడు పదార్ధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు.
విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు .. మణిపూర్‌లోని ఇంఫాల్ లోయలోని ఐదు జిల్లాల్లో సెర్చింగ్ ఆపరేషన్ నిర్వహించారు. ఇంఫాల్ తూర్పు, ఇంఫాల్ పశ్చిమ, బిష్ణుపూర్, కాక్చింగ్, తౌబాల్ అనే ఐదు లోయ జిల్లాల శివార్లలో జూన్ 13-14 మధ్య రాత్రి నిఘా వర్గాల నేతృత్వంలో దాడులు నిర్వహించినట్లు మణిపూర్ పోలీసులు తెలిపారు.
“ఉమ్మడి బృందాలు పేలుడు పదార్థాలు, ఇతర ఆయుధాల నిల్వలను స్వాధీనం చేసుకున్నాయి. 151 SLR రైఫిల్, 65 ఇన్సాస్ రైఫిల్స్, ఇతర రకాల 73 రైఫిల్స్, 5 కార్బైన్ గన్, 2 MP-5 గన్, భారీగా బుల్లెట్ నిల్వలను స్వాధీనం చేసుకున్నాయి” అని మణిపూర్ పోలీసు ADGP లారి డోర్జీ లాటూ తెలిపారు. మొత్తం తుపాకులు, రైఫిళ్లు 328 స్వాధీనం చేసుకున్నామని ఆయన చెప్పారు.
#WATCH | Imphal: Lhari Dorjee Lhatoo, ADGP Manipur Police says “In the intervening night of 13-14 June, search operations were launched in the outskirts of 5 valley districts by joint teams of Manipur Police, CAPF, Army and Assam Rifles. Explosives and other warlike stores were… pic.twitter.com/hsb2mppEXQ
— ANI (@ANI) June 14, 2025
మణిపూర్‌లో శాంతిభద్రతలు కాపాడడానికి ప్రజలకు సహకరించాలని పోలీసు అధికారులు విజ్ఞప్తి చేశారు. అరాచకశక్తులపై పోలీసులకు వెంటనే సమాచారం అందించాలని కోరారు ఏడీజీపీ డార్జీ. ఎట్టి పరిస్థితుల్లో కూడా రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడుతామని వెల్లడించారు.
సాధారణ స్థితిని పునరుద్ధరించడానికి అందరూ సహకరించాలని.. మణిపూర్ పోలీసులు, భద్రతా దళాలు కోరాయి..
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..