Manipur : అత్యాచారం హత్య కేసులో నిర్దోషిగా తేలిన వ్యక్తికి ప్రభుత్వ ఉద్యోగం.. ఎక్కడంటే..

|

Jan 05, 2021 | 9:31 AM

అత్యాచారం హత్య కేసులో నిర్దోషిగా తేలిన వ్యక్తికి  ఉద్యోగావకాశం కలిపించింది మణిపూర్ ప్రభుత్వం.  తౌడమ్ జిబల్ సింగ్ అనే వ్యక్తి..

Manipur : అత్యాచారం హత్య కేసులో నిర్దోషిగా తేలిన వ్యక్తికి ప్రభుత్వ ఉద్యోగం.. ఎక్కడంటే..
Follow us on

Manipur : అత్యాచారం హత్య కేసులో నిర్దోషిగా తేలిన వ్యక్తికి ఉద్యోగావకాశం కలిపించింది మణిపూర్ ప్రభుత్వం. తౌడమ్ జిబల్ సింగ్ అనే వ్యక్తి అత్యాచారం, హత్య కేసులో 8 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాడు.అదే సమయంలో ప్రజలు ఆగ్రహంతో అతని ఇంటిని దహనం చేశారు. ఆతర్వాత కేసులో నిర్దోషిగా జైలు నుంచి బయటపడ్డాడు. సెషన్సు కోర్టు జిబల్ సింగ్ నిర్దోషి అని విడుదల చేశాక అతడు మణిపూర్ సీఎం ఎన్ బీరెన్ సింగ్ ను కలిశారు. ఎలాంటి తప్పు చేయకుండా 8 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించిన అతడికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని మణిపూర్ ఎన్ బీరెన్ సింగ్ హామీ ఇచ్చారు. జిబల్ సింగ్ కు ఇల్లు నిర్మించి ఇవ్వడంతో పాటు అతనికి అటవీశాఖలో ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తానని సీఎం హామి ఇచ్చారు.

also read : Bank Will Responsible For Hacking : మీ ఖాతా నుంచి నగదు మీ ప్రమేయం లేకుండా పోతే… బ్యాంకుదే బాధ్యత…