Cooker Bomb Blast: బాంబు పేలుడు ఘటనలో నమ్మలేని నిజాలు.. అడవిలో ట్రయల్ బ్లాస్ట్ నిర్వహించిన తర్వాతే.. నిందితుడికి ఐఎస్‌ఐఎస్ లింకులు..

మంగళూరులో నవంబర్ 19 సాయంత్రం జరిగిన ఆటో పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు గుర్తించారు. షరీక్‌కి సంబంధించి ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్‌ఐఎస్) హ్యాండ్లర్‌లతో షరీక్‌కు పరిచయం ఉందని..

Cooker Bomb Blast: బాంబు పేలుడు ఘటనలో నమ్మలేని నిజాలు.. అడవిలో ట్రయల్ బ్లాస్ట్ నిర్వహించిన తర్వాతే.. నిందితుడికి ఐఎస్‌ఐఎస్ లింకులు..
Cooker Bomb Blast
Follow us

|

Updated on: Nov 21, 2022 | 4:38 PM

కర్నాటక మంగళూరు ఆటో బాంబు బ్లాస్ట్ కేసులో తీగ లాగుతున్న పోలీసులు. మంగళూరులో నవంబర్ 19 సాయంత్రం జరిగిన ఆటో పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు గుర్తించారు. ఈ పేలుడులో ఆటోడ్రైవర్‌తో పాటు షరీక్ అనే యువకుడు కూడా గాయపడ్డారు. ప్రస్తుతం వారిద్దరూ మంగళూరులోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. షరీక్‌కి సంబంధించి ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్‌ఐఎస్) హ్యాండ్లర్‌లతో షరీక్‌కు పరిచయం ఉందని, అంతకుముందు శివమొగ్గలో బాంబు పేలుడు ఘటనలో కూడా ఇతను నిందితుడని పోలీసులు తెలిపారు. మరోవైపు పేలుడు కేసుకు సంబంధించి ఏడీజీపీ అలోక్ కుమార్ మాట్లాడుతూ.. నవంబర్ 19న రాత్రి 7:40 గంటల ప్రాంతంలో మంగళూరు నగరం వెలుపల ఓ ఆటోలో పేలుడు జరిగిందన్నారు. ఈ ఘటనలో ప్రయాణికులు, డ్రైవర్లు ఉలిక్కిపడ్డారు. ఆటో డ్రైవర్‌ను పురుషోత్తం పూజారిగా గుర్తించారు. అందులో ప్రయాణించిన ప్రయాణికుడిని షరీక్‌ అని తేల్చారు.

మహ్మద్ షరీక్‌పై మూడు కేసులు..

నిందితుడిపై మూడు కేసులు ఉన్నట్లుగా పోలీసులు తెలిపారు. మంగళూరు నగరంలో రెండు, శివమొగ్గలో ఒక కేసు ఉన్నట్లుగా అలోక్ కుమార్ తెలిపారు. రెండు కేసుల్లో నిందితుడిపై యూఏపీఏ కింద కేసు నమోదు చేయగా, మూడో కేసులో వాంటెడ్ గా ఉన్నాడు. నిందితుడు చాలా కాలంగా పరారీలో ఉన్నట్లుగా తెలిపారు.

ఓసారి అడవిలో ట్రయల్ బ్లాస్ట్ చేసిన తర్వాతే..

సెప్టెంబరు 19న తుంగభద్ర నది ఒడ్డున ఉన్న అటవీప్రాంతంలో మరో ఇద్దరు సహచరులతో కలిసి షరీక్ ట్రయల్ బ్లాస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ సంఘటన తరువాత.. నవంబర్ 20 న పోలీసులు మాజ్ మునీర్ , సయ్యద్ యాసిన్‌లను అరెస్టు చేశారు. అయితే షకీర్ పోలీసులను తప్పించుకొని తప్పించుకోగలిగాడు. ఆ తర్వాత దొంగిలించిన ఆధార్ కార్డుతో మైసూరులో ఇల్లు అద్దెకు తీసుకుని బాంబుల తయారీ ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఇందులో భాగంగానే ఓసారి అడవిలో ఇలాంటి చిన్న బాంబును తయారు చేసి అడవిలో ప్రాక్టీస్  చేసినట్లుగా పోలీసులు గుర్తించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం