Crime news: డేటింగ్ యాప్ ద్వారా పరిచయం.. హోటల్ కు తీసుకెళ్లి అత్యాచారం.. ఆ తర్వాత

|

Jun 11, 2022 | 7:37 AM

సోషల్ మీడియా(Social Media).. నేరాలకు అడ్డాగా మారుతోంది. కరోనా కారణంగా వచ్చిన విపరీతమైన మార్పులతో ఇప్పుడు చిన్నాపెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరి చేతుల్లో సెల్ ఫోన్ దర్శనమిస్తోంది. దీంతో ప్రతి ఒక్కరూ...

Crime news: డేటింగ్ యాప్ ద్వారా పరిచయం.. హోటల్ కు తీసుకెళ్లి అత్యాచారం.. ఆ తర్వాత
Harassment
Follow us on

సోషల్ మీడియా(Social Media).. నేరాలకు అడ్డాగా మారుతోంది. కరోనా కారణంగా వచ్చిన విపరీతమైన మార్పులతో ఇప్పుడు చిన్నాపెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరి చేతుల్లో సెల్ ఫోన్ దర్శనమిస్తోంది. దీంతో ప్రతి ఒక్కరూ సామాజిక మాధ్యమాల్లో మునిగితేలుతున్నారు. మరోవైపు.. ఆధునిక పాశ్చాత్య పోకడలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ కోవలేనిదే డేటింగ్. సోషల్ మీడియాలో డేటింగ్ యాప్ తోనూ నేరాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఢిల్లీలో ఇలాంటి ఘటనే జరిగింది. డేటింగ్ యాప్(Dating App) ద్వారా పరిచయమైన ఓ వ్యక్తి.. తనపై అత్యాచారం చేశాడని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దేశ రాజధాని ఢిల్లీలో(Delhi) దారుణం జరిగింది. డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన మహిళపై ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. నైరుతి ఢిల్లీలో ఈ ఘటన జరిగింది. సోషల్ మీడియా యాప్ ద్వారా పరిచయమైన ఓ వ్యక్తి తనపై లైంగిక దాడికి పాల్పడినట్టు ఢిల్లీకి చెందిన 28 ఏళ్ల మహిళ పోలీసులను ఆశ్రయించింది.

హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి తనకు డేటింగ్‌ యాప్‌లో కలిశాడని బాధితురాలు పోలీసులకు వెల్లడించింది. అతడితో కలిసి హోటల్‌కు వెళ్లగా అక్కడ తనపై అత్యాచారం చేశాడని కంప్లైంట్ ఇచ్చింది. ఘటన జరిగిన తర్వాత తాను ఫోన్ చేసినా అతను స్పందించలేదని, ఫిర్యాదులో తెలిపింది. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి