ప్రధాని మోదీ, బేర్ గ్రిల్స్ ఆ మధ్య పాల్గొన్న ‘ మ్యాన్ వర్సెస్ వైల్డ్ ‘ షో కి వచ్చిన రేటింగ్స్ వావ్ అనిపిస్తున్నాయి. ఆగస్టు 12 న ప్రసారమైన ఈ షో హయ్యెస్ట్ రేటింగ్స్ తో వాల్డ్ వైడ్ పాపులర్ అయింది. డిస్కవరీ ఛానల్ లో 3. 05 మిలియన్ ఇంప్రెషన్లను కొల్లగొట్టి ఆ వారంలో ఇది మూడో స్థానాన్ని చేజిక్కించుకుంది. స్టార్ ప్లస్ 3. 67 మిలియన్లు, జీ టీవీ 3. 36 మిలియన్ ఇంప్రెషన్లతో వరుసగా ఒకటి, రెండు స్థానాల్లో ఉన్నాయి. ఇక హయ్యెస్ట్ స్లాట్ వ్యూయర్ షిప్ లోనూ మోదీ, గిల్స్ షో టాప్ లో నిలిచింది. డిస్కవరీ ఛానల్ లో 6. 1 మిలియన్ ఇంప్రెషన్స్ దక్కించుకుంది. ప్రపంచ వ్యాప్తంగా 180 దేశాల్లో ఈ ఛానల్ కు సంబంధించిన నెట్ వర్కుల్లో ఈ షో ప్రసారమైంది. బేర్ గిల్స్ తో మోదీ ఉత్తరాఖండ్ లోని జిమ్ కార్బెట్ నేషనల్ పార్కులో నిర్వహించిన ఈ షోలో పాల్గొన్నారు. ప్రకృతి పట్ల తన అభిమానాన్ని చాటుకున్నారు. ప్రకృతి అంటే.. పర్యావరణమే అని, దీని పరిరక్షణకు ప్రపంచ దేశాలన్నీ నడుం బిగించాలని ఆ సందర్భంగా ఆయన ఓ సందేశమిచ్చారు.