సౌకర్యంగా ఉంటుందని నిత్యం లక్షలాది మంది రైలు ప్రయాణం చేస్తుంటారు. అందుకు 2, 3 నెలల ముందుగా రిజర్వేషన్ చేసుకుంటారు కూడా. మన దేశంలో ఏ రైలు ఎక్కినా అందులో నాసిరకం ఆహారం, మురికిగా ఉండే బాత్రూమ్‌లు, క్రమరహితంగా ఉండే రైలు షెడ్యూల్‌లు విసిగెత్తిస్తాయి. వీటి గురించి వేలాది మంది ప్యాసింజర్లు ఎన్నిసార్లు రైల్వేకు మొరపెట్టుకున్నా పరిస్థితి మాత్రం షరా మామూలే. తాజాగా ఓ ప్రయాణికులు తన గోడును సోషల్ మీడియాలో వెళ్లగక్కాడు. ఓ వ్యక్తి సౌత్ బీహార్ ఎక్స్‌ప్రెస్‌లోని ఏసీ కోచ్‌లో ప్రయాణించాడు. కానీ కాసేపటికే తన కోచ్‌లోకి ఎలుకలు రావడం చూసి పరేషానయ్యాడు. వెంటనే తన కంపార్ట్‌మెంట్‌లో స్వైర విహారం చేస్తున్న ఎలుకల దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. రైళ్లలో పరిశుభ్రత ఏ మేరకు ఉందో తెలుపుతూ రైల్వే శాఖకు ఫిర్యాదు చేశాడు. ఇక ఈ వీడియో కాస్త వైరల్ కావడంతో పలువురు గతంలో తమకు ఎదరైన అనుభవాలను పంచుకుంటూ ఆందోళన వ్యక్తం చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. అసలేం జరిగిందంటే..
ప్రశాంత్ కుమార్ అనే వ్యక్తి సౌత్ బీహార్ ఎక్స్‌ప్రెస్‌లో సెకండ్ క్లాస్ ఏసీ టికెట్ రూ. 2 వేలకుపైగా చెల్లించి సౌకర్యవంతంగా ప్రయాణిద్దామని రైలు ఎక్కాడు. అయితే రైలులో తన సీటు వద్ద ఎలుకలు ఉండటం చూసి ఖంగుతిన్నాడు. అనంతరం కోచ్ మొత్తం ఎలుకలు తిరుగుతున్న వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. తన వివరాలు కూడా వెల్లడిస్తూ రైల్వేకు ఫిర్యాదు చేశాడు. ‘రైలు నంబర్ 13288, PNR 6649339230, కోచ్ A2లో ఎలుకలు సీట్లు, లగేజీపైకి ఎక్కుతున్నాయి. అందుకే నేను AC 2 క్లాస్ కోసం డబ్బు చెల్లించానా?’ అని తన ఎక్స్ ఖాతాలో పోస్టులో ప్రశ్నించాడు. తన ట్వీట్‌లో కేంద్ర రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్, ఐఆర్‌సీటీసీ, రైల్వేమంత్రిత్వశాఖ అధికారులు, మీడియా సంస్థలకు ట్యాగ్ చేశాడు.
@complaint_RGD @IRCTCofficial @RailMinIndia @RailwaySeva @AshwiniVaishnaw
PNR 6649339230, Train 13288, multiple rats in coach A1, rats are climbing over the seats and luggage.
Is this why I paid so much for AC 2 class?@ndtv @ndtvindia @aajtak @timesofindia @TimesNow @htTweets pic.twitter.com/vX7SmcfdDR— Prashant Kumar (@pkg196) March 6, 2025
దీనిపై రైల్వే స్పందిస్తూ.. వైరల్ అవుతున్న ట్విట్టర్ వీడియో రైలు నంబర్ 13288 ట్రైన్ మార్చి 6, 2025న జరిగింది. A 1 49 & 50 ప్రయాణికులు సీట్లపై ఎలుకలు ఎక్కుతున్నాయని ఫిర్యాదు చేశారు. దీంతో రైల్వే సిబ్బంది కోచ్ నంబర్ A-1 ను లిజోల్ క్రిమిసంహారక మందుతో డ్రై స్వీపింగ్, వెట్ స్వీపింగ్ చేసి శుభ్రం చేశారు. ఆ తర్వాత సీటింగ్ ఏరియా కింద దోమల స్ప్రే చేశారు. సీటు కింద గ్లూ ప్యాడ్ ఉంచామని తెలిపారు. దీనిపై నెటిజన్లు భిన్నరీతిగా స్పందిస్తున్నారు. చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేయగా, మరికొందరు దీనిని ఇండియన్ రైల్వే ప్రయాణికులకు ఇవన్నీ సాధారణ అనుభవంగా భావించి కొట్టిపారేశారు. మరికొందరు రైలులో ఎలుకలు తిరగడం వల్ల తలెత్తే తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాలు, పరిశుభ్రత సమస్యల గురించి ఆందోళన వ్యక్తం చేశారు. రైల్వే శాఖ టికెట్ల పేరిట వేల రూపాయలు వసూలు చేస్తారు. పరిశుభ్రత గురించి దేవుడెరుగు.. అందులో ఆహారం భయంకరంగా ఉంటుంది. టాయిలెట్లు కూడా అంతే. నెలలో ఒకటి లేదా రెండుసార్లు ఉతికిన లినెన్‌ను మారుస్తారంటూ రైలులోని అపరిశుభ్రత గురించి ఏకరువు పెట్టాడు ఓ యూజర్. ‘మీ టికెట్ RAC కావచ్చు. దాన్ని చెక్ చేయండి. మీరిద్దరూ సీటు పంచుకోవాలి’ అని మరో యూజర్ జోకులు పేల్చాడు. ఇంతకీ మీరేమంటారు..
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.